Tips to Choose Right Credit Card For Daily Life:నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి చాలా రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఆఫర్స్, రివార్డులు, తక్కువ వడ్డీలు అందించేవి బోలెడు ఉన్నా.. వాటి గురించి చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి.. కేవలం కంపెనీలు అందిస్తున్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా మీ డైలీ అవసరాలకు ఎలాంటి క్రెడిట్ కార్డు సరిపోతుందో తెలుసుకొని.. వాటిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మీ కుటుంబం కోసం బడ్జెట్ వేసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడానికి టిప్స్:
కార్డు ఎంపిక: కొన్ని క్రెడిట్ కార్డ్స్ .. ట్రావెలింగ్, ఇంధనం, షాపింగ్ వంటి కేటగిరీలపై ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంటాయి. కాబట్టి.. మీరు దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారో గుర్తుంచుకుని.. ఆ కేటగిరీలోని కార్డును తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు వాహనంలో పెట్రోల్ కోసం క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తారని అనుకుంటే.. ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులు ఎంచుకోవడం బెస్ట్.
రివార్డ్స్: మీరు క్రెడిట్ కార్డ్స్ కొనేముందు వాటి బెనిఫిట్స్ తెలుసుకోవాలి. కొన్ని కార్డ్‌లు క్యాష్ బ్యాక్ అందిస్తాయి. మరికొన్ని ట్రావెల్ పాయింట్లు అందిస్తాయి. అందువల్ల.. మీ జీవనశైలి, ప్రాధాన్యతలకు అనుగుణంగా రివార్డ్‌లు కలిగిన కార్డ్‌ని ఎంచుకోండి.
వార్షిక ఫీజు:క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము ఎంత ఉందో చెక్ చేయాలి. మంచి ప్రయోజనాలతో కార్డు ఉందంటే.. వార్షిక రుసుము కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వార్షిక రుసుము కంటే మీకు ఎక్కువ ప్రయోజనాలు వస్తున్నాయో లేదో తెలుసుకోవడం చాలా అవసరం.
క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!