తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips - ONLINE SAFE SHOPPING TIPS

Tips For Safe Online Shopping : ఇప్పుడంతా ఆన్​లైన్ షాపింగ్ యుగం నడుస్తోంది. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఆన్​లైన్​లోనే ఆర్డర్ పెడితే నిర్ణీత సమయంలో మన దగ్గరకు వచ్చేస్తోంది. అయితే ఆన్​లైన్ షాపింగ్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటంటే?

Tips For Safe Online Shopping
Tips For Safe Online Shopping

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 7:32 PM IST

Tips For Safe Online Shopping : ఈ-కామర్స్ రంగం రోజురోజుకు కొత్త శిఖరాలను తాకుతోంది. కొత్త లక్ష్యాలను పెట్టుకుని దూసుకుపోతోంది. ఈ-కామర్స్ రంగానికి నమ్మకం అనేది ప్రధానం. నమ్మకం లేకపోతే ఈ రంగంలో ఏం సంస్థలు కూడా రాణించలేవు. అందుకోసమే ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల నమ్మకం కోసం ఏవైనా చేస్తుంటాయి. ఈ విధానమే అనేక మంది ఈ-కామర్స్ వైపు మొగ్గు చూసి కొనుగోళ్లు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తోంది. ధరను పోల్చుకోవడం, డిస్కౌంట్లు, ఆఫర్లు ఇలా ప్రతి ఒక్కటీ మీ ముందుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో ఏమాత్రం కూడా అలర్ట్​గా లేకపోయినా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ మోసానికి గురికాకుండా మీరు ఈ చిట్కాలు ఫాలో అవుతూ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు.

నమ్మకమైన వెబ్​సైట్ల నుంచి షాపింగ్ చేయడం
చాలా వెబ్​సైట్లలో ప్రత్యక ఆఫర్లు, డిస్కౌంట్లు మనల్ని మరింత ఆకర్షిస్తుంటాయి. కానీ ఎప్పుడూ కూడా నమ్మకమైన వెబ్​సైట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని గుర్తు తెలియని వెబ్​సైట్ల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే స్కామర్లు రెడీగా ఉంటారు. ఏమాత్రం చిన్న క్లూ దొరికినా మన సమాచారాన్ని మొత్తం లాగేస్తుంటారు. ప్యాడ్ లాక్ సింబల్​ ఉన్న వెబ్​సైట్స్​లో మాత్రమే సెర్చ్ చేయండి. ఇలాంటి వెబ్​సైట్లో మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాయి. మీ ప్రమేయం లేకుండా వచ్చే కొన్ని పాప్ అప్ చేసే వెబ్​సైట్​లో సురక్షితం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

స్ట్రాంగ్ పాస్​వర్డ్ మస్ట్​
కొంతమంది ఈజీగా గుర్తుండాలని సింపుల్ పాస్​వర్డ్​ను ఉపయోగిస్తుంటారు. అలా కాకుండా ఆన్​లైన్ షాపింగ్ అకౌంట్ కోసం అప్పర్, లోవర్ కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్​తో స్ట్రాంగ్ పాస్​వర్డ్​ను క్రియేట్ చేసుకోవాలి. మీ పాస్​వర్డ్​లో పుట్టిన రోజులు లేదా తల్లిదండ్రుల పేరు ఇంటి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించకూడదు. టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ మెథడ్​ను ఉపయోగించడం బెటర్. ఇది మీ పాస్ వర్డ్​తోపాటు మీ ఫోన్ నుంచి కోడ్​ను ఎంటర్ చేయడం ద్వారా మీ ఆన్​లైన్ అకౌంట్స్ అదనపు సెక్యూరిటీని కలిగి ఉంటుంది.

డెబిట్ కార్డులను ఉపయోగించడం మానుకోండి
సాధ్యమైనప్పుడు, ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించండి. ఎందుకంటే చాలా క్రెడిట్ కార్డ్‌లు డెబిట్ కార్డ్‌లతో పోలిస్తే మెరుగైన సేఫ్టీని అందిస్తాయి. డెబిట్ కార్డ్‌లు మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉంటాయి. కాబట్టి సైబర్ నేరగాళ్లకు మీ అకౌంట్ డిటైయిల్స్ తెలిసే ప్రమాదం ఉంటుంది.

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు
అనుమానాస్పద లింక్​పై క్లిక్ చేయకండి. మీకు వచ్చిన లింక్ సరైందా? కాదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. భారీ డిస్కౌంట్స్ ప్రకటించే సైట్లపై ఓ కన్నేసి ఉండండి. అవి నిజంగానే డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తున్నాయా అనే విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే స్కామర్లు తరచుగా ప్రజలను ఆకర్షించడానికి ఫేక్ లింక్స్​ను ఉపయోగిస్తారు. మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్​ను పొందడానికి మీరు ముందస్తుగా చెల్లించాల్సిన డీల్ పట్ల ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి.

మీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను చెక్ చేయండి
ఏదైనా అనధికార ఛార్జీల కోసం మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. మీరు ఏదైనా అనుమానాస్పద ట్రాన్సక్షన్ చూసినట్లయితే వెంటనే మీ బ్యాంక్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ కంపెనీకి సమాచారం తెలియజేయండి.

ABOUT THE AUTHOR

...view details