Tata Curvv Electric Car :దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కర్వ్ ఈవీని రూపొందిస్తోంది. కూపే-స్టైల్ రూఫ్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీపైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. వాస్తవానికి టాటా కంపెనీ 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024'లోనే ఈ ప్రొడక్షన్ రెడీ మోడల్‌ను ఆవిష్కరించింది.
Tata Curvv EV Features :ఈ కర్వ్ ఈవీ హై-గ్లోస్ బ్లాక్ ఫినిస్తో ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఇంటీరియర్ చాలా విలాసంగా, ప్రీమియం ఫినిషింగ్‌తో వస్తుంది. హెవీ లగేజ్ పెట్టడానికి అనువైన బూట్ స్పేస్ దీనిలో ఉంది.
ఈ టాటా కర్వ్ ఈవీలో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. టాటా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇంటీరియర్‌ను కూడా సరికొత్త డిజైన్‌తో రూపొందిస్తోంది. అలాగే దీనిలో అధునాతన ఫీచర్లను జోడిస్తోంది.
టాటా కర్వ్ ఈవీలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమరుస్తున్నారు. అలాగే దీనిలో వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కెపాసిటివ్ కంట్రోల్ లెవెల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో 6-ఎయిర్ బ్యాగ్స్‌ను అమరుస్తున్నారు. వీల్స్ ఎయిరో బ్లేడ్ డిజైన్‌తో హోలిస్టిక్ ఫీల్‌ను ఇస్తాయి.