తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా ఐదో రోజు భారీ నష్టాలు - సెన్సెక్స్​ 984 పాయింట్స్ డౌన్​ - STOCK MARKET TODAY

23,600కు పడిపోయిన నిఫ్టీ - భారీగా నష్టపోయిన ఆటో, బ్యాంకింగ్​, ఫైనాన్సింగ్ స్టాక్స్​

STOCK MARKET
STOCK MARKET (IANS)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 3:39 PM IST

Updated : Nov 13, 2024, 4:10 PM IST

Stock Market Today November 13, 2024:దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా తరలివెళ్తుండడమే ఇందుకు కారణం. వీటికి తోడు అక్టోబర్​లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరగడం కూడా మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 984 పాయింట్లు నష్టపోయి 77,690 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 324 పాయింట్లు కోల్పోయి 23,559 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు :టాటా మోటార్స్​, ఎన్​టీపీసీ, ఏసియన్ పెయింట్స్​, ఇన్ఫోసిస్​
  • నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్​, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, కోటక్ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, రిలయన్స్​, పవర్​గ్రిడ్​, టీసీఎస్

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.3,024.31 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.

గ్లోబల్ మార్కెట్స్​
బుధవారం ఏసియన్ మార్కెట్లలో సియోల్​, టోక్యో, హాంకాంగ్ నష్టాలతో ముగియగా, షాంఘై లాభాలతో స్థిరపడింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఒక్క పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.38గా ఉంది.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.93 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 72.56 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 13, 2024, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details