12.30 PM : శనివారం నిర్వహించిన రెండో ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరిగింది. విదేశీ పెట్టుబడులు కూడా భారీగా తరలి వచ్చాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది 22,376 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్లు :టాటా స్టీల్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్
- నష్టపోయిన షేర్లు :ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్
12.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 73,839 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 45 పాయింట్లు వృద్ధి చెంది 22,384 వద్ద కొనసాగుతోంది.
11.30 AM : సెకెండ్ ట్రేడింగ్ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 73,890 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు వృద్ధి చెంది 22,394 వద్ద కొనసాగుతోంది.
10.00 AM : శనివారం నిర్వహించిన ఫస్ట్ స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,860 వద్ద ట్రేడ్ ఆల్-టైమ్ హై లెవల్స్ వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 56 పాయింట్లు వృద్ధి చెంది 22,395 జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడింది.
Stock Market Today March 2nd 2024 :శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు జీవన కాల గరిష్ఠాలను తాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 236 పాయింట్లు లాభపడి 73,982 వద్ద ఆల్-టైమ్ హై రికార్డును తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు వృద్ధి చెంది 22,420 రికార్డ్ పీక్‌ను టచ్ చేసింది. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరగడం సహా, విదేశీ పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్ సెషన్లోనూ భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.