Stock Market Today January 20th 2024 :శనివారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 71,802 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 47 పాయింట్లు వృద్ధిచెంది 21,669 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా
- నష్టాల్లో కొనసాగుతున్న షేర్స్ : హిందూస్థాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్
కారణం ఏమిటంటే?
సాధారణంగా షేర్ మార్కెట్లకు శనివారం సెలవు ఉంటుంది. కానీ ఈ శనివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని ఎక్స్ఛేంజీలు తెలిపాయి. దీనికి బదులుగా సోమవారం నాడు (జనవరి 22న) స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందని ప్రకటించాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించడమే ఇందుకు కారణం.
స్పెషల్ టెస్టింగ్ సెషన్
స్టాక్ ఎక్స్ఛేంజీలు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం 'ఫెయిల్‌సేఫ్ సిస్టమ్'ను రూపొందించాయి. ఈ కొత్త సిస్టమ్‌ను టెస్ట్ చేయడం కోసం శనివారం రెండు స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్‌ను నిర్వహిస్తున్నాయి. డీఆర్ సైట్ ద్వారా ఈ ప్రత్యేక సెషన్ల నిర్వహణ జరుగుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఎలాంటి టెక్నికల్ లోపాలు రాకుండా, ట్రేడింగ్ సెషన్స్ నిలిచిపోకుండా ఉండేందుకు ఈ ఫెయిల్‌సేఫ్ సిస్టమ్‌ను రూపొందించారు.