Stock Market Close Today March 11th 2024 :సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దీనితో వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. బ్యాంకింగ్, మెటల్ షేర్లు పూర్తిగా పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 616 పాయింట్లు నష్టపోయి 73,502 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 22,332 వద్ద స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ : నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా
- నష్టపోయిన షేర్స్ : పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్
విదేశీ పెట్టుబడులు
FIIs Investments :స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.7,304 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
ఆసియా మార్కెట్లు
Asian Markets March 11th 2024 :ఏసియన్ మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ నష్టపోగా; హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్, షాంఘై కాంపోజిట్ లాభాలతో ముగిశాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.