Stock Market Close Today March 1st 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ జీవన కాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతం మేర పెరగడం సహా, విదేశీ పెట్టుబడులు తరలి వస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1,2 పాయింట్లు లాభపడి 73,745 వద్ద ఆల్‌టైమ్ హై-రికార్డ్‌తో స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 335 పాయింట్లు వృద్ధి చెంది 22,338 వద్ద జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిసింది.
Stock Market All Time High Today :దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను తాకాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న సానుకూల వాతావరణంతో పాటు కీలక షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1,139 పాయింట్లు లాభపడి 73,639 వద్ద ఆల్‌టైమ్ హై-రికార్డ్‌ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 335 పాయింట్లు వృద్ధి చెంది 22,318 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.