Smart SIP Tips : ఈ రోజుల్లో చట్టబద్ధంగా డబ్బు సంపాదించుకునేందుకు చాలా మంది ఎంచుకుంటున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్. అందులోనూ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అనేది చిన్న చిన్న మొత్తాలతో మిమ్మల్ని కోటీశ్వరులు అయ్యోలా చేస్తోంది. అందుకే చిన్న పెట్టుబడిదారులు కూడా ఇలాంటి సిప్పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మంచి భవిష్యత్తుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సిప్ విధానంలో మ్యుచువల్ ఫండ్స్ దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెట్టాలి. కేవలం ఒకటి, రెండేళ్లు మాత్రమే పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ రావు. కనీసం 15 నుంచి 20ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. అలా జరగాలంటే ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. నిజంగా ఇలా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే, కచ్చితంగా కోటీశ్వరులు కావచ్చు.
సిప్ ఎందుకు?
సిప్ విధానంలో పెట్టుబడి పెట్టేందుకు రోజు, వారం, నెలవారీగా - ఇలా చాలా ఆప్షన్లు ఉంటాయి. చాలా మంది నెలవారీ ఆప్షన్‌ను ఎంచుకుంటారు. వారికి ఏ నెలకు ఆ నెల మొత్తం పెట్టుబడిపై రాబడి వస్తుంటుంది. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. సాధారణ భాషలో చెప్పాలంటే చక్రవడ్డీ లాంటి ప్రభావం ఉంటుంది. అందువల్ల కాలం గడుస్తున్న కొద్దీ మీ పెట్టుబడి మొత్తం బాగా పెరుగుతుంటుంది.
కాంపౌండింగ్ ఎఫెక్ట్
ఉదాహరణకు మీరు నెలవారీ రూ.9500 చొప్పున పెట్టుబడి పెట్టారనుకుందాం. వార్షిక రాబడి 17 శాతం వరకు వస్తుందని అనుకుందాం. అప్పుడు మీకు 25 ఏళ్లలో 4.6 కోట్ల రాబడి వస్తుంది. అంటే మీరు కేవలం 25 ఏళ్లలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే?
- మీరు పెట్టిన పెట్టుబడి కేవలం రూ.28,50,000 (రూ.28.5 లక్షలు)
- మ్యూచువల్ ఫండ్ మెచ్యూరిటీ రూ.4,55,96,882 (రూ.4.55 కోట్లు)
- మీకు వచ్చిన మొత్తం లాభం : రూ.4,27,46,882 (రూ.4.27 కోట్లు)