RBI Governor Sanjay Malhotra :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రాను పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. బుధవారం గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్హోత్రా మూడేళ్ల పాటు పదవీలో కొనసాగనున్నారు.
RBI గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా
ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా
Published : 5 hours ago
|Updated : 4 hours ago
మూడు దశాబ్దాల అనుభవం
సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పుర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ అభ్యసించారు. విద్యుత్, ఆర్థిక, పన్నులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైన్స్ తదితర రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో అపారమైన అనుభవం కలిగిన ఆర్థిక, ట్యాక్సేషన్‌లో అపారమైన అనుభం కలిగిన సంజయ్ మల్హోత్రా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
2018లో ఆర్‌బీఐ 25 గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడు సంవత్సరాలు పొడిగించింది. ఈ గడువు కూడా డిసెంబర్ 10తో ముగిసింది. వృద్ధి మందగమనానికి కారణాలు చాలా ఉంటాయని, కేవలం ఆర్‌బీఐ రెపో రేటు మాత్రమే అందుకు కారణం కాదని ఆర్‌బీఐ గవర్నర్‌గా మంగళవారం పదవీ విరమణ చేసిన శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను దృష్టిలో పెట్టుకునే సరైన నిర్ణయాలను పరపతి విధానాల్లో కనబరచినట్లు ఆయన అన్నారు.