Post Office Recurring Deposit Scheme:ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా.. వచ్చిన ఆదాయంలో కొంత మేర పొదుపు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు నేటి జనరేషన్. భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా.. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు వీలుగా పొదుపు చేస్తున్నారు. అయితే మనం సంపాదించిన డబ్బును మదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లో ఆర్‌డీ(రికరింగ్ డిపాజిట్) ఒకటి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను దేశంలోని వివిధ బ్యాంకులతోపాటు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కూడా నిర్వహిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసులోనే మదుపు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకంలో కొద్ది కొద్దిగా జమ చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. ఒక వేళ మీరు నెలకు రూ.1000 చొప్పున జమ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత ఎంతొస్తుంది? వడ్డీ ఎంత? అనే వివరాలు తెలుసుకుందాం.
రికరింగ్ డిపాజిట్లు:రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలా నెలా తమకు నచ్చినంత పొదుపు చేసుకోవచ్చు. ప్రస్తుతం 2024, ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి 6.7 శాతం మేర వడ్డీ అందిస్తోంది కేంద్రం. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. కనీసం రూ.100 నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టవచ్చు. దానికి పరిమితి లేదు. అయితే రానున్న త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అది ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి అదనపు ప్రయోజనం కల్పిస్తుంది.
10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు - పోస్టాఫీసు సూపర్ స్కీమ్! - Post Office RD Scheme