ETV Bharat / business

ఈ స్కీమ్ కింద ఉచితంగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్‌ - ఎవరు అర్హులు? - ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? - 7 Lakhs Free Insurance Scheme

author img

By ETV Bharat Business Team

Published : Sep 4, 2024, 11:16 AM IST

7 Lakhs Free Insurance Scheme : ప్రతి ఉద్యోగికి EPF అకౌంట్ ఉంటుంది. కానీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. అదేంటంటే.. ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండా రూ. 7 లక్షల వరకు బీమా కవరేజీ పొందవచ్చు తెలుసా? అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Employee Deposit Linked Insurance Scheme
7 Lakhs Free Insurance Scheme (ETV Bharat)

Employee Deposit Linked Insurance Scheme: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు ఈపీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) ఈ అకౌంట్​లను నిర్వహిస్తుంటుంది. జాబ్​ చేసే ప్రతి ఎంప్లాయి నెలనెలా తన ప్రాథమిక జీతంలో 12 శాతం పీఎఫ్ అకౌంట్​కు కంట్రిబ్యూషన్​గా చెల్లిస్తారు. సరిగ్గా అంతే మొత్తంలో వారి యజమాని లేదా కంపెనీ ఆ అకౌంట్​కి జమ చేస్తారు. ఈ డబ్బును ఉద్యోగులు తమ అత్యవసర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇంత వరకు అందరికీ తెలుసు. కానీ, చాలా మంది పీఎఫ్ చందాదారులకు.. ఒక్క రూపాయి చెల్లించకుండా ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా రూ.7 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ పొందవచ్చనే విషయం తెలియదు. అసలేంటి.. EDLI స్కీమ్? ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ప్రయోజనాలేంటి? దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

EDLI స్కీమ్ అంటే ఏమిటంటే?: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే.. ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (EDLI). దీన్ని 1976లో ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ స్కీమ్ కింద.. ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ ఏకమొత్తంలో బీమా మొత్తాన్ని అందుకుంటారు.

ఎవరెవరికి వర్తిస్తుందంటే?: EDLI స్కీమ్ ఈపీఎఫ్​లోని క్రియాశీల చందాదారులందరికీ వర్తిస్తుంది. అంటే.. EPFO ఖాతాను కలిగి ఉన్న ఏ ఉద్యోగి అయినా ఆటోమేటిక్‌గా EDLI స్కీమ్‌కు అర్హులు అవుతారట. అదేవిధంగా.. ఈ బీమా ఇన్సూరెన్స్ పొందడానికి ఉద్యోగి ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. ఉద్యోగులు ఈపీఎఫ్‌కు చందా సహకారం అందిస్తే సరిపోతుంది. EDLI నిబంధనల ప్రకారం యజమాని.. ఉద్యోగి బేసిక్‌, డీఏలో 0.50% లేదా గరిష్ఠంగా నెలకు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌వో చట్టం వర్తించే అన్ని ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఆర్థిక ప్రయోజనాలివే!

  • ఉద్యోగి మరణిస్తే.. అతడిపై ఆధారపడిన కుటుంబసభ్యులు EDLI స్కీమ్ కింద లభించే బెనిఫిట్స్ పొందేందుకు అర్హులు.
  • సర్వీసులో ఉన్న ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో అర్హతగల కుటుంబసభ్యులకు రూ.7 లక్షల గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాన్ని ఏక మొత్తంగా 'EPFO' అందిస్తుంది.
  • మరణించిన సభ్యుడు మరణానికి ముందు 12 నెలల పాటు నిరంతర ఉద్యోగ సర్వీసులో ఉంటే.. కనీస హామీ ప్రయోజనం కింద అర్హతగల కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షలు అందిస్తారు.
  • అలాగే.. బీమా ప్రయోజనం నేరుగా నామినీ లేదా చట్టపరమైన వారసుడి బ్యాంకు అకౌంట్​కు జమ చేస్తారు.

EDLI కింద క్లెయిమ్‌ ప్రాసెస్‌ చేయడానికి ఏ పత్రాలు సమర్పించాలంటే?

  • ఫారం 51F పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • EDLI కింద నమోదయిన ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం.
  • చట్టపరమైన వారసుడు క్లెయిమ్‌ ఫైల్‌ చేసిన సందర్భంలో వారసత్వ సర్టిఫికెట్‌ అవసరం.
  • సహజ సంరక్షకుడు కాకుండా మరొక వ్యక్తి మైనర్‌ తరఫున దావా వేస్తే.. అతడి గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.
  • చెల్లింపును స్వీకరించే వ్యక్తి అకౌంట్​కు సంబంధించి రద్దు చేసిన చెక్‌.

ప్రయోజనాలను ఎలా క్లెయిమ్‌ చేయాలి?

  • EDLI కింద బీమా మొత్తాన్ని స్వీకరించడానికి నామినీ నమోదు కానట్లయితే, కుటుంబ సభ్యులు లేదా చట్టపరమైన వారసులు దాని కోసం అప్లై చేసుకోవచ్చు.
  • అయితే, మరణించిన వ్యక్తి ఆ సమయంలో EPF స్కీమ్‌కు యాక్టివ్‌ కంట్రిబ్యూటర్‌గా ఉండాలి. EDLI ఫారం 51Fను హక్కుదారు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి.
  • అలాగే.. క్లెయిమ్‌ ఫారంపై యజమాని సంతకం చేసి ధ్రువీకరించాలి.
  • క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేయడానికి క్లెయిమ్‌దారుడు తప్పనిసరిగా పూర్తి చేసిన ఫారంతో పాటు అన్ని డాక్యుమెంట్‌లను ప్రాంతీయ EPF కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
  • ఈపీఎఫ్‌ కమిషనర్‌ క్లెయిమ్‌ స్వీకరించిన 30 రోజులలోపు క్లెయిమ్‌ డబ్బును అందజేయాలి. లేకపోతే ఆలస్యమయిన సమయానికి సంవత్సరానికి 12% వడ్డీతో పాటు హక్కుదారుకు క్లెయిమ్‌ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి :

EPFO చందాదారులకు గుడ్ న్యూస్​ - పర్సనల్ డీటైల్స్ మార్చుకునే అవకాశం!

ప్రైవేట్​ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఇకపై ఈజీగా EPS విత్​డ్రా - సర్వీస్​ లేకపోయినా నో ప్రోబ్లమ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.