Online Insurance Vs Offline Insurance : ఆరోగ్య బీమా, జీవిత బీమా, వాహన బీమా ఇలా బీమా సౌకర్యాన్ని ప్రస్తుతం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ కంటే ఆఫ్ లైన్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. దశాబ్దాలుగా ఆఫ్‌లైన్ కొనసాగుతూ వస్తోంది. కొవిడ్ లాక్డౌన్ పరిమాణాల అనంతరం ఆఫ్‌లైన్ ప్రాముఖ్యత పెరిగింది. పలు రకాల బీమా పాలసీలను ఆన్లైన్లోనే కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. చౌక్ పాలసీతోపాటు మెరుగైన ఫ్లెక్సిబిలిటీని పొందవచ్చు. అంతేకాదు పాలసీలను సరిపోల్చడానికి మీరు సరిపోయే బీమాను ఎంచుకునేందుకు ఆన్ లైన్ మీకు పూర్తి స్వచ్చు ఉంటుంది. అయితే మీరు పాలసీని కొనుగోలు చేసే ముందు ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోవాలి.
ఆన్లైన్లో కొనుగోలు ప్రక్రియ
మీరు ఆన్లైన్లో బీమా కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా మీరు బీమా సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లోనే నమోదు చేయాలి. ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ వివరాలను బట్టి ప్రీమియం ఎంతనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. అయితే నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ప్రీమియం చెల్లించాలి. తర్వత మీకు సంస్థ ఈమెయిల్ ద్వారా పాలసీ డాక్యుమెంట్ పంపిస్తుంది.
ఆఫ్‌లైన్‌లో బీమా పాలసీ
ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తే బీమా ప్లాన్స్‌ను మాన్యువల్‌గా సరిపోల్చాలి. దరఖాస్తును పూర్తి చేసి ఆ దరఖాస్తులో అడిగిన వివరాల డాక్యుమెంట్స్‌ను కూడా సమర్పించాలి. అవసరమైన పత్రాల్లో వైద్య రికార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, అడ్రస్ మొదలైనవి ఉంటాయి. మీ దరఖాస్తు బీమా సంస్థ ఆమోదించిన తర్వాత పాలసీకి సంబంధించిన రశీదును ఇస్తారు. బీమాకు సంబంధించిన పత్రాలను పోస్టులో ఇంటి చిరునామాకు పంపిస్తారు.