Maruti Suzuki Discounts in June 2024 :కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రస్తుత రోజుల్లో చాలా మంది కారును వినియోగిస్తున్నారు. మరి మీరు కూడా ఒక మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Maruti Grand Vitara Discounts : మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వెర్షన్స్‌పై రూ.74,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. వివరంగా చెప్పాలంటే రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4వేలు కార్పొరేట్ బోనస్ ఇస్తోంది. అలాగే కొన్ని హైబ్రిడ్ వేరియంట్స్‌కు మూడేళ్ల వారెంటీని అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్లపై రూ.14,000 - రూ.64,000 వరకు డిస్కౌంట్ ఇస్తుండగా, సీఎన్జీ వెర్షన్లపై రూ.4వేలు కార్పొరేట్ బోనస్ మాత్రమే ఇస్తున్నారు.
Maruti Grand Vitara Price :ఈ మార్కెట్లో ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.09లక్షల వరకు ఉంటుంది.
2. Maruti Fronx Discounts :మారుతి ఫ్రాంక్స్ కార్లపై (టర్బో-పెట్రోల్ వేరియంట్) రూ.57వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,000 కార్పొరేట్ బోనస్ చొప్పున ఇస్తున్నారు. వీటితోపాటు రూ.3,000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్ కూడా అందిస్తున్నారు. ఫ్రాంక్స్ పెట్రోల్ వేరియంట్ రూ.27వేల డిస్కౌంట్‌తో, సీఎన్జీ వెర్షన్ రూ.12వేలు వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి.
Maruti Fronx Price :ఈ మారుతి ఫ్రాంక్స్ కార్ ధర రూ.7.52 లక్షల నుంచి రూ.13.04లక్షల వరకు ఉంటుంది.
3. Maruti Jimny Discounts :మారుతి జిమ్నీ వేరియంట్స్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Maruti Jimny Price : మారుతీ జిమ్మీ ధర రూ.12.74 లక్షల నుంచి రూ.14.95 లక్షల వరకు ఉంటుంది.
4. Maruti Baleno Discounts : మారుతి కంపెనీ 'బాలెనో' (ఆటోమేటిక్ వెర్షన్)పై రూ.57,100 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,000 కార్పొరేట్ బోనస్ రూపంలో లభిస్తాయి. మారుతి బాలెనో మాన్యువల్ వెర్షన్‌పై రూ.52,100 డిస్కౌంట్, సీఎన్జీ వేరియంట్‌పై రూ.32,100 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.