తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్టీ నుంచి ఎఫ్‌డీ రూల్స్‌ వరకు - జనవరి 1 నుంచి వచ్చే కీలక ఆర్థిక మార్పులు ఇవే! - FINANCIAL CHANGES FROM JANUARY 2025

ఎల్పీజీ సిలిండర్ ధరల నుంచి వీసా నిబంధనల వరకు - న్యూ ఇయర్ ఫైనాన్సియల్ ఛేంజెస్‌ ఇవే!

Financial Changes
Money (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2024, 11:46 AM IST

Financial Changes From January 2025 : 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. త్వరలో 2025 వచ్చేస్తోంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం అంటే జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీఎస్టీ
2025 జనవరి 1 నుంచి ఇండియాలో వ్యాపారాలు కఠినమైన జీఎస్టీ నిబంధనలతో నిర్వహించాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కొక్కటి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA):జీఎస్టీ పోర్టల్స్‌లో సేఫ్టీని పెంచడానికి, ఇకపై పన్ను చెల్లించే వారందరికీ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి కానుంది.

ఈ-వే బిల్ పరిమితులు :180 రోజుల కంటే పాతవి కాని బేస్‌ డాక్యుమెంట్లపై మాత్రమే ఇకపై ఈ-వే బిల్స్‌ను జనరేట్ చేస్తారు. మోసాలను తగ్గించడం కోసమే ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.

థాయ్‌లాండ్ వీసా
జనవరి 1నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచి అయినా సందర్శకులు అధికారిక వెబ్‌ సైట్ www.thaievisa.go.th ద్వారా థాయ్‌లాండ్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ-వీసా వ్యవస్థ కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు భారతీయులు సహా ఇతర దేశీయులు కూడా ఎక్కడ నుంచైనా ఆన్‌లైన్‌లో ఈ- వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పైగా దీని కోసం డైరెక్ట్‌గా డాక్యుమెంట్లు సమర్పించక్కరలేదు. కనుక పర్యటకులు సులభంగా థాయ్‌లాండ్‌కు వెళ్లిపోవచ్చు.

యూఎస్ వీసా నిబంధనల్లో మార్పులు
2025 జనవరి 1 నుంచి నాన్-ఇమ్మిగ్రేంట్ వీసా దరఖాస్తుదారులు ఎక్స్‌ట్రా ఫీజు లేకుండా ఒకసారి తమ యూఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అదనపు రీషెడ్యూల్స్ కోసం మాత్రం దరఖాస్తు రుసుములు, ఇతర ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌-1హీ వీసా ఓవర్‌హాల్‌ జనవరి 17, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ద్వారా సులువుగా హెచ్‌-1బీ వీసా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌లో వీసా అపాయింట్‌మెంట్ నిరీక్షణకు చాలా సమయం పడుతోంది. ముఖ్యంగా బీ1/బీ2 వీసాలకు సగటను 400 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోంది.

టెలికాం కొత్త నిబంధనలు
టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (రైట్ ఆఫ్ వే) నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. భూగర్భ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ జరుగుతుంది. కనుక జియో, ఎయిర్‌ టెల్, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీల సేవలను మెరుగుపడనున్నాయి.

ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్
2025 జనవరి 1 నుంచి అనేక పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ, హెచ్‌టీసీ వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా టీ, ఎల్‌జీ ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, మోటో జీ, మోటో ఈ 2014 వంటి వాటిలో వాట్సాప్ పనిచేయదు.

ఎల్పీజీ సిలిండర్ ధరలు
చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్‌ ధరలను సమీక్షిస్తాయి. గత ఐదు నెలలుగా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతోంది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈసారి ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి.

కార్ల ధరలు పెంపు
2025 జనవరి 1 నుంచే కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, కియా మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కార్ల ధరలు 2-4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

ఎఫ్‌డీ రూల్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 1 నుంచి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన విధానాలను మార్చింది. వీటిలో ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకునే నియమాలకు సంబంధించిన మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లకు బీమా చేయడం వంటివి ఉన్నాయి.

యూపీఐ 123 పే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నాళ్ల క్రితం 'యూపీఐ 123 పే' పరిచయం చేసింది. దీని లావాదేవీల పరిమితులను రూ.5,000 నుంచి రూ. 10,000లకు పెంచింది. ఈ పెంపు జనవరి 1నుంచి అమల్లోకి రానుంది. 'యూపీఐ 123 పే' అనేది స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details