Lpg Gas Cylinder Price Increase :కేంద్రం బడ్జెట్‌కు ముందు చమురు సంస్థలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. 19కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను గురువారం రూ.14 మేర పెంచాయి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు. గృహ అవసరాల వంటగ్యాస్ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, రెస్టారెంట్లు లాంటి వాటిల్లో వాడతారు. తాజాగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు గురువారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1755.50 నుంచి 1769.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1769.50, ముంబయిలో రూ.1887, చెన్నైలో రూ.1937కు చేరుకుంది.
గత నెల(జనవరి 1న) నూతన సంవత్సరం వేళ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూపాయిన్నర తగ్గించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. గృహ అవసరాల వంటగ్యాస్ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి.