తెలంగాణ

telangana

ETV Bharat / business

మీకు ఐటీ నోటీసులు వచ్చాయా? డోంట్ వర్రీ - అవి అసలైనవో, కాదో చెక్ చేసుకోండిలా! - How To Authenticate IT Notice - HOW TO AUTHENTICATE IT NOTICE

How To Authenticate IT Notice Online : మీకు ఇన్​కమ్​ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ నుంచి నోటీసులు వచ్చాయా? అది చూసినప్పటి నుంచి మీకు చాలా ఆందోళనగా ఉందా? డోంట్ వర్రీ. మీకు వచ్చిన ఐటీ నోటీసులు అసలైనవా? నకిలీవా? అని ముందు చెక్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

How To Check IT Notice Online
How To Authenticate IT Notice Online (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 4:13 PM IST

How To Authenticate IT Notice Online : మీకు ఇన్​కమ్ ట్యాక్స్​ నోటీసులు వచ్చాయా? ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదా? అయితే ఇది మీ కోసమే. చాలా మంది ఐటీ నోటీసులు రాగానే చాలా ఆందోళన చెందుతారు. కానీ అంతగా భయపడాల్సిన అవసరంలేదు. ముందుగా మీకు వచ్చిన నోటీస్​ అసలైనదా? నకిలీదా? అనేది చెక్ చేసుకోవాలి.

మీకు వచ్చిన ఐటీ నోటీసు ప్రామాణికతను తనిఖీ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ముందుగా మీకు వచ్చిన ఈ-మెయిల్ ఐడీని క్రాస్ చెక్ చేయాలి. intimations@cpc.incometax.gov.in, incometax.gov.inల నుంచి నోటీస్​ వస్తే, దానిని అసలైనదిగా గుర్తించవచ్చు. లేకుంటే దానిని నకిలీదా భావించవచ్చు. అలాగే మీకు వచ్చిన ఐటీ నోటీసులు అసలైనవా, కాదా అనేది చూడడానికి మరో మార్గం ఉంది. అది ఏమిటంటే?

How To Authenticate Income Tax Notice :
ఐటీ శాఖ అధికారిక వెబ్​సైట్​ చూడడం ద్వారా కూడా ఐటీ నోటీసుల ప్రామాణీకతను తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే?

  • ముందుగా మీరు ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​ https://eportal.incometax.gov.in ఓపెన్ చేయాలి.
  • quick linksలోని Authenticate notice/ order issued by ITDపై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
  • మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే - మీ పాన్​, డాక్యుమెంట్ టైప్​, అసెస్మెంట్ ఇయర్, ఇష్యూ డేట్​, మొబైల్ నంబర్​లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • (ఇది అసెస్మెంట్ ఇయర్ 2011- 12 నుంచి ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుంది.)
  • ఒక వేళ మీ వద్ద డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్​ నంబర్ ఉంటే, రెండో ఆప్షన్​ ఎంచుకుని- DIN నంబర్, మొబైల్ నంబర్​లను ఎంటర్ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఓ 6 అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. అంతే సింపుల్​!
  • మీకు ఐటీ శాఖ నిజంగానే నోటీసులు పంపిస్తే- DIN నోటీస్​​, అలాగే ఆ నోటీస్ జారీ చేసిన తేదీ కనిపిస్తాయి.
  • ఒకవేళ ఐటీ శాఖ మీకు నోటీస్ పంపించకపోతే, No records Found for the given criteria అని కనిపిస్తుంది.
  • ఈ విధంగా మీరు ఆన్​లైన్​లోనే చాలా ఈజీగా, మీకు వచ్చిన ఐటీ నోటీసులు అసలైనవా లేదా నకిలీవా అని తెలుసుకోవచ్చు.

మీరు EPF చందాదారులా? ఈ 7రకాల పెన్షన్​లు గురించి తెలుసుకోవడం మస్ట్! - Types Of EPFO Pensions

ఐటీ​ రీఫండ్ స్టేటస్​ - ఆన్​లైన్​లో ఈజీగా చెక్ చేసుకోండిలా! - Income Tax Refund Status Check

ABOUT THE AUTHOR

...view details