Cancelling A Credit Card Affect Your Credit Score : ఈరోజుల్లో క్రెడిట్ కార్డు వారే సంఖ్య విపరీతంగా పెరిగింది. బ్యాంకులు కూడా మంచి ఆఫర్లు ఇస్తుండడంతో చాలా మంది వీటిని తీసుకుంటున్నారు. కొందరి దగ్గర ఒకటి కంటే ఎక్కువే క్రెడిట్ కార్డులు(Credit Cards) ఉంటున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనవసరంగా వాడేస్తున్నామనో.. అదనంగా ఇతర ఛార్జీలు పడుతున్నాయనో.. క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేయాలనే కొందరు ఆలోచిస్తుంటారు. కానీ.. క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేస్తే సిబిల్ స్కోర్ దెబ్బతింటుందని భయపడుతుంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు ఫాలో అయ్యారంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేస్తే దాని ప్రభావం సిబిల్ స్కోర్‌పై తప్పకుండా ఉంటుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకునేటప్పుడు ఇబ్బంది రావొచ్చు. క్రెడిట్ లిమిట్ కూడా తగ్గిపోవచ్చు. ఏది ఏమైనా క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే.. ముందు ఈ విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
Credit Card Cashbacks Latest Update : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మీకో షాకింగ్ న్యూస్..!
- ముందుగా మీ కార్డుపై ఏదైనా బాకీ ఉంటే ఆ మొత్తాన్ని క్లియర్ చేసుకోవాలి. లేదంటే మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకునే ముందు మీరు దానిపై కలిగి ఉన్న రుణాల రకాలను విశ్లేషించడం, క్రెడిట్ వినియోగ నిష్పత్తి, క్రెడిట్ ఖాతాల హోల్డింగ్ వ్యవధిని లెక్కించడం చాలా ముఖ్యం.
- మీరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను క్లోజ్ చేసినా.. లేదా చాలా కాలంగా ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులను రద్దు చేసినా.. అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయవచ్చు.
- అందుకే ఒకేసారి ఎక్కువ కార్డ్‌లను క్లోజ్ చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు.
- అలాగే.. అత్యధిక క్రెడిట్ పరిమితిని కలిగి ఉన్న లేదా మీ పాత క్రెడిట్ కార్డ్‌ను మూసివేయకపోవడమే మంచిదని అంటున్నారు.
- ఎందుకంటే ఇది మీ రీపేమెంట్‌కు సంబంధించి సుదీర్ఘ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం వాడతాం కాబట్టి క్రెడిట్ హిస్టరీ మొత్తం దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కార్డు రద్దు చేసే ముందు వీలైతే మీరు పరిమితిని మరొక కార్డుకు రిడిస్ట్రిబ్యూటింగ్ చేయడం గురించి ఆలోచించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
- చివరగా.. మీరు క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి రాతపూర్వకంగా కార్డు రద్దుకు సంబంధించిన నిర్ధారణ పత్రాన్ని పొందాలి. ఇది చాలా ముఖ్యం.
- ఇవన్నీ చూసుకున్నా.. మీ క్రెడిట్ స్కోర్‌పై కొంత ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని క్రెడిట్ కార్డును క్యాన్సిల్ ఆలోచన చేయడం మంచిదని అంటున్నారు.
How to Cancel or Close Credit Card : క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేయాలా..? ఇలా సింపుల్‌గా కట్ చేయండి!