తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - sbi debit card pin generation

How To Activate SBI Debit Card Online : మీరు కొత్తగా ఎస్​బీఐ డెబిట్ కార్డు తీసుకున్నారా? యాక్టివేషన్ ఎలా చేయాలో తెలియడం లేదా? అయితే ఇది మీ కోసమే. ఎస్​బీఐ డెబిట్​ కార్డును ఆన్​లైన్​లో ఎలా సింపుల్​గా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Activate SBI Debit Card Online
SBI Debit Card Activation Process

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 1:49 PM IST

How To Activate SBI Debit Card Online :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల డెబిట్ కార్డులను మంజూరు చేస్తుంటుంది. కొత్త ఎస్‌బీఐ డెబిట్ కార్డును పొందిన వెంటనే దాన్ని నిర్దిష్ట ప్రాసెస్‌లో యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం బ్యాంకు బ్రాంచ్​కు వెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్​గా ఆన్​లైన్​లో ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ retail.onlinesbi.sbi ద్వారా ఏటీఎం కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా ఎస్‌బీఐ కస్టమర్‌ ఐడీ ద్వారా ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ https://www.onlinesbi.sbi/ ద్వారా కూడా కొత్త ఏటీఎం కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌ యాక్టివేషన్ ప్రాసెస్

  • మొదటిగా మీరు www.onlinesbi.com వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  • మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌‌లోకి లాగిన్ అవ్వండి.
  • 'ఈ-సర్వీసెస్' ఆప్షన్‌ను ఎంచుకుని, దానిలో అంతర్గతంగా చూపించే 'ఏటీఎం కార్డ్ సేవలు' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • తరువాత ఓపెన్ అయ్యే పేజీలో 'కొత్త ఏటీఎం కార్డ్ యాక్టివేషన్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • మీరు కొత్త ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెల నంబరును ఎంటర్ చేయండి.
  • కార్డు వివరాలను నిర్ధారించడానికిగాను, దాని కిందే ఇచ్చిన మరో బాక్సులో ఏటీఎం కార్డు నంబరును మళ్లీ ఎంటర్ చేయాలి.
  • ఆపై 'యాక్టివేట్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ వెంటనే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులోని అన్ని వివరాలను చెక్ చేసుకొని 'కన్ఫార్మ్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబరుకు హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ వస్తుంది.
  • ప్రత్యేకంగా ఓపెన్ అయ్యే వెబ్ పేజీలో ఈ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి 'కన్ఫార్మ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఈ ప్రాసెస్ పూర్తయ్యాక మీ 'ఏటీఎం కార్డు యాక్టివేషన్‌ సక్సెస్' అయ్యిందంటూ ఒక మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దీని తరువాత మీ ఏటీఎం కార్డును ఉపయోగించడానికిగాను ఏటీఎం పిన్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం ఏదైనా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి ఎస్ఎంఎస్ లేదా ఐవీఆర్ ద్వారా ఏటీఎం పిన్‌ను సెట్ చేసుకోవచ్చు.
  • మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే నేరుగా బ్యాంకు బ్రాంచీని సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోండి.

ABOUT THE AUTHOR

...view details