Gold Rate Cheap In Which Country :పండగలు, శుభకార్యాల వేళ భారతీయులకు బంగారం కొనుగోలు చేయడం అలవాటే! ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! కానీ పండగల సీజన్లో మార్కెట్లోని పసిడి ధరలు బాగా పెరిగిపోతుంటాయి. అందువల్ల ధర అధికంగా ఉన్నప్పటికీ, కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇటీవల కాలంలో అలంకరణ కోసమే కాకుండా అత్యవసర సమయంలో ఆదుకునే ఆస్తిగా పసిడిని భావిస్తున్నారు. అందుకే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దానిని ఓ పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నా, సురక్షితమైన మార్గంగా పసిడినే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కంటే బంగారం చౌకగా లభించే 5 దేశాలపై ఓ లుక్కేద్దాం.
1. ఇండోనేసియా
ఇండోనేసియాలో బంగారం ధరలు భారత్తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో తక్కువ ధరకే బంగారం దొరికే దేశాల్లో ఇండోనేసియా ముందు వరుసలో ఉంటుంది. అక్టోబరు 14న ఇండోనేసియాలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,334,098 IDR (ఇండోనేసియా రూపాయ్)గా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో రూ.7,2070 అన్నమాట. అదే సమయంలో భారత్లో 10 గ్రాముల పసిడి ధర రూ.78,265గా ఉంది. అంటే భారత్ కంటే ఇండోనేసియా 10 గ్రాముల బంగారం ధర రూ.6,200 తక్కువగా లభిస్తోంది.
2. మలావి
తూర్పు ఆఫ్రికాలోని మలావిలో 10 గ్రాముల బంగారం ధర 1,473,940 MWK (మలావియన్ క్వాచా) గా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో రూ. 71,356. ఇది భారత్లో ప్రస్తుతం ఉన్న 10 గ్రాముల పసిడి ధర కంటే రూ.6,900 తక్కువ.