Gold Investment Tips For Women :అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం శుభప్రదమని భారతీయ మహిళలు భావిస్తుంటారు. అందుకోసమే బంగారు నగలు కొంటూ ఉంటారు. బంగారం ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. అత్యవసరాలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం నేడు అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక స్వేచ్ఛ!
పెట్టుబడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు దీర్ఘకాలిక భద్రతను అందిస్తుంది. పైగా ఇది మహిళా సాధికారతకు దారితీస్తుంది. అంతేకాకుండా కుటుంబానికి అవసరమైన సంపదను సృష్టిస్తుంది. బంగారంలో పెట్టుబడి ఆర్థిక నష్టాల నుంచి, ద్రవ్యోల్బణ ప్రమాదాల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. ఇందుకోసం ఎఫ్డీ, బంగారం, బాండ్లు లాంటి వివిధ రకాల స్థిరమైన పెట్టుబడులను ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్ లాంటి పెట్టుబడులను కూడా ఎంచుకోవచ్చు. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులకు నష్టభయం ఎక్కువగా ఉంటుంది.
రిస్క్ లేని పెట్టుబడి
బంగారం స్పష్టమైన విలువ గల ఒక ఆస్తి. ఇతర ఆస్తుల మాదిరిగా అధిక తరుగుదల లేదా అస్థిరత ఉండదు. బంగారంలో పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక భద్రత చేకూరుతుంది. పైగా ఆర్థిక నష్టాలు వచ్చినప్పుడు, మీ బంగారం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అదే సమయంలో సులభంగా డబ్బును చేసుకోవడానికి (లిక్విడిటీ) వీలవుతుంది. ద్రవ్యోల్బణం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
భౌతిక బంగారం Vs డిజిటల్ బంగారం
చాలా మంది కాయిన్స్ లేదా కడ్డీలు లాంటి భౌతిక బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమే. ఇలాంటి భౌతిక బంగారం ఇంట్లో ఉన్నప్పుడు, అవసరమైన సందర్బాల్లో అది మనకు అక్కరకు వస్తుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు చేసుకోవడానికి వీలవుతుంది. లేదా బ్యాంక్‌లో కుదువపెట్టి, తక్కువ వడ్డీకే సులభంగా రుణం తీసుకోవడానికి వీలవుతుంది. పైగా కాలం గడిచిన కొలదీ మీ బంగారం విలువ పెరుగుతుంది. అయితే ఆధునిక కాలంలో భౌతిక బంగారంతోపాటు డిజిటల్ బంగారంపైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలుగుతోంది. దీని వల్ల దొంగలభయం ఉండదు. భౌతికంగా వాటికి కాపాలా ఉండాల్సిన అవసరం ఉండదు. పైగా మార్కెట్‌కు అనుగుణంగా దానిపై వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది.
చూశారుగా, మరి మీరు కూడా బంగారంపై పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఉన్న టాప్-3 గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.