Best Scooty Under 1 Lakh: చాలా మంది మహిళలకు స్కూటీపై కాలేజీకి, ఆఫీస్‌కు వెళ్లాలని ఉంటుంది. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీని కొనాలని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు అన్నీ రూ.1 లక్ష కంటే తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. పైగా సూపర్ స్టైలిష్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్‌తో వాటిని అందిస్తున్నాయి. అందుకే ఆ స్కూటీలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
1. Yamaha RayZR 125 Fi Hybrid Features :ఈ యమహా స్కూటీలో 125 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 6500 rpm వద్ద 8.2 PS పవర్, 5000 rpm వద్ద 10.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఈ యమహా స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ స్కూటీ 5 వేరియంట్లలో, 12 అందమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ యమహా స్కూటీకి పోటీగా మార్కెట్లో హోండా యాక్టివా 125, హోండా యాక్టివా 6జీ, హోండా డియో 125 ఉన్నాయి.
Yamaha RayZR 125 Fi Hybrid Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ యమహా స్కూటీ ధర సుమారుగా రూ.87,295 - రూ.97,264 ఉంది.
2. Yamaha Fascino 125 Fi Hybrid Specs :ఈ యమహా స్కూటీలో 125 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 6500 rpm వద్ద 8.2 PS పవర్, 5000 rpm వద్ద 10.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఈ యమహా స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 69 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ వాహనం 5 వేరియంట్స్, 14 అందమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ యమహా స్కూటీకి పోటీగా మార్కెట్లో హోండా యాక్టివా 125, హోండా యాక్టివా 6జీ, హోండా డియో 125 ఉన్నాయి.
Yamaha Fascino 125 Fi Hybrid Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ యమహా స్కూటీ ధర సుమారుగా రూ.84,088 - రూ.94,561 ఉంది.
3. Honda Activa 125 features :ఈ హోండా యాక్టివా స్కూటీలో 124 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 6250 rpm వద్ద 8.30 PS పవర్, 5000 rpm వద్ద 10.4 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. హోండా యాక్టివా స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ వాహనం నాలుగు వేరియంట్స్, 5 అందమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటీకి పోటీగా మార్కెట్లో సుజికి యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125 ఉన్నాయి.
Honda Activa 125 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ హోండా స్కూటీ ధర సుమారుగా రూ.84,718 - రూ.93,890 వరకు ఉంది.
4. Hero Destini Prime Features :ఈ స్కూటీలో 124 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 7000 rpm వద్ద 9.09 PS పవర్, 5500 rpm వద్ద 10.36 Nm టార్క జనరేట్ చేస్తుంది. ఈ వాహనం 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హీరో డెస్టినీ స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 56 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Hero Destini Prime Price :ప్రస్తుతం మార్కెట్లో ఈ హీరో స్కూటీ ధర సుమారుగా రూ.79,548 ఉంది.
5. Suzuki Avenis Features :ఈ సుజుకి స్కూటీలో 124 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 6750 rpm వద్ద 8.7 PS పవర్, 5500 rpm వద్ద 10 Nm టార్క జనరేట్ చేస్తుంది. దీని ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఈ స్కూటీ లీటర్ పెట్రోల్‌కు 55 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ వాహనం రెండు వేరియంట్స్‌లో, 5 అందమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటీకి పోటీగా మార్కెట్లో హోండా యాక్టివా 125, హోండా యాక్టివా 6జీ, హోండా డియో 125 ఉన్నాయి.
Suzuki Avenis Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ సుజుకి స్కూటీ ధర సుమారుగా రూ.97,675 - రూ.98,746 వరకు ఉంది.