Aha Subscription Plans :ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనగానే గుర్తొచ్చేవి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ప్రస్తుతం వీటి హవా నడుస్తోంది. పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్ అన్నీ వేరే దేశాలకు, ప్రాంతాలకు చెందినవి. కానీ మన తెలుగులో కూడా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉంది. అదే 'ఆహా'!
ఆహా - అనేది అర్హా మీడియా & బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ఓటీటీ ప్లాట్ ఫ్లామ్. ఇది గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇది మొదటి తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్. 2020 మార్చి 25న దీన్ని ప్రారంభించారు. దీనిలో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎక్స్‌క్లూజివ్స్, ఆహా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్స్, ఆహా ఒరిజినల్స్ తదితర కంటెంట్ ఉంటుంది. ఈ యాప్ అన్ని మొబైల్, టాబ్లెట్, వెబ్, స్మార్ట్ టీవీ, స్ట్రీమింగ్ డివైజ్‌ల్లో పనిచేస్తుంది. అన్‌స్టాపబుల్, సామ్ జామ్ లాంటి ప్రోగ్సామ్స్తో బాగా ఫేమస్ అయిందీ యాప్.
Aha Subscription Plans 2024 :
ఆహాలో 4 రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. వీటిల్లో 3 నెలల వ్యవధి కలిగినవి రెండు, ఏడాది వ్యవధి కలిగిన ప్లాన్స్ మూడు ఉన్నాయి. వినియోగదారులు తమ బడ్జెట్‌ను బట్టి తగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
Aha 99 Plan :ఆహా ప్లాట్‌ఫామ్ రూ.99లకే బేసిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 3 నెలలు. ఇందులో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉంటాయి. 720p రిజల్యుషన్‌తో హెచ్డీ క్వాలిటీ వీడియోలు చూడొచ్చు. స్టీరియో ఆడియో ఉంటుంది. కానీ ఇది కేవలం మొబైల్లోనే వస్తుంది. కంప్యూటర్ లేదా టీవీల్లో దీనిని చూడలేము. సపోర్ట్ చేయదు.
Aha 199 Plan :ఆహా రూ.199లకే మరో క్వార్టర్లీ ప్లాన్ అందిస్తోంది. దీనితో ఫుల్ హెచ్డీ (1080p) వీడియోలు చూడవచ్చు. స్టీరియో టైప్ ఆడియో ఉంటుంది. తెలుగు మూవీస్, వెబ్ సిరీస్‌లు వీక్షించవచ్చు. కానీ యాడ్స్ వస్తాయి. చాలా మంది ప్రిఫర్ చేసే ప్లాన్ ఇది.