Top Load Washing Machine Cleaning Tips:ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. టాప్లోడ్, ఫ్రంట్ లోడ్ అంటూ ఎవరికి నచ్చినట్లు వారు తీసుకుంటున్నారు. ఈ మెషిన్ ఉపయోగించడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. అయితే, చాలా మంది వాషింగ్ మెషిన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. పైన చూడడానికి శుభ్రంగా కనిపిస్తుందని.. లోపల కూడా బాగానే ఉందనుకుంటారు. అయితే దుస్తుల్ని చక్కగా ఉతికే వాషింగ్ మెషిన్‌ని నెలకోసారైనా క్లీన్ చేయాలని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం..
టాప్లోడ్ వాషింగ్ మెషిన్ క్లీనింగ్‌కు కావాల్సిన పదార్థాలు:
- సాఫ్ట్ క్లాత్
- పాత టూత్ బ్రష్ లేదా డిష్ స్క్రబర్
- డిస్టిల్డ్ వైట్ వెనిగర్
- డిష్ స్క్రబ్బింగ్ లిక్విడ్
క్లీనింగ్ విధానం:
- నీటి గురించి వాషింగ్ మెషిన్‌లో సెటింగ్స్ ఉంటాయి. కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్లలో హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ మెషిన్‌లో కూడా ఆ ఆప్షన్ ఉంటే హై హార్ట్ వాటర్, ప్రెజర్‌ది సెట్ చేయమంటున్నారు నిపుణులు. దీనివల్ల వాటర్ మెషిన్ చక్కగా క్లీన్ అవుతుందని.. ఆ ఆప్షన్ లేకుంటే నార్మల్ వాటర్ ఆన్ చేయమంటున్నారు.
- ఇప్పుడు ఎంచుకున్న సెట్టింగ్స్ ప్రకారం.. మెషిన్‌ని ఆన్ చేసి.. వాషర్ డ్రమ్‌ని నీటితో నింపమంటున్నారు. నీరు నిండిన తర్వాత.. డ్రమ్‌లో నాలుగు కప్పుల డిస్టిల్డ్ వైట్ వెనిగర్ వేయాలని చెబుతున్నారు.
- ఇప్పుడు వాషింగ్ మెషిన్ క్లీన్ చేయడానికి.. ఎక్కువ టైమ్ సెట్ చేసి రన్ చేయమంటున్నారు. ఎక్కువ సేపు తిరిగితే డ్రమ్ లోపల మురికి బయటకు వస్తుందని.. వాషింగ్ సైకిల్ పూర్తయ్యాక డ్రమ్‌లోని నీటిని తీసేయమంటున్నారు. మరోసారి వాటర్‌తో క్లీన్ చేస్తే మొత్తం వెనిగర్ బయటికి వస్తుందని అంటున్నారు.