తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిరుమల వేంకటేశ్వరస్వామి కళ్లు ఎప్పుడు ఎందుకు మూసి ఉంచుతారు? - కారణం ఇదేనట! - Fascinating Facts About Tirumala

Interesting Facts About Tirumala Balaji : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుపతి వెళ్తుంటారు. స్వామి వారిని వేయి కళ్లతో దర్శించుకుని తరిస్తూ ఉంటారు భక్తులు. ఇదిలా ఉంటే.. తిరుమల వేంకటేశ్వరుని కళ్లు ఎప్పుడు మూసే ఉంటాయి. అయితే, అలా ఎందుకు మూసి ఉంచుతారో మీకు తెలుసా?

Tirumala Balaji Interesting Facts
Tirumala

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 2:50 PM IST

Fascinating Facts About Tirumala Balaji : భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇది దేశంలోనే రెండో అత్యంత ధనిక దేవాలయం. కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోరికలు తీర్చే.. శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాలినడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే.. తిరుమలలో(Tirumala) కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే ఆయన కళ్లు ఎప్పుడూ మూసే ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు స్వామి వారి కళ్లు ఎందుకు మూసి ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? దీనిపై పండితులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వేంకటేశ్వరుని కళ్లు ఎందుకు మూసి ఉంచుతారంటే?

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలో ఉన్న తిరుమల దేవస్థానాన్ని కలిగయుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. అయితే.. ఇక్కడ శ్రీహరి అవతారంలో కొలువై ఉన్న తిరుమలేశుడి శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతారు. తెల్లని క్లాత్ కడతారు. అయితే, ఎందుకు స్వామి వారి నేత్రాలు మూసి ఉంచుతారనే దానికి పండితులు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. వేంకటేశ్వరుని కళ్లు విశ్వశక్తికి మించినవని.. అందుచేత భక్తులు శ్రీవారి కళ్లలోకి నేరుగా చూడలేరట. ఈ కారణం చేతనే.. తిరుమల బాలాజీ కళ్లు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు.

అయితే, ప్రతి గురువారం వేంకటేశ్వర స్వామి కళ్ల ముసుగును మారుస్తారట. ఆ టైమ్​లో మాత్రమే కొన్ని క్షణాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి నేత్రాలను నేరుగా చూడగలరని పండితులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. మీరు తిరుమల వేంకటేశ్వరుని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి.

హైదరాబాద్​ To తిరుపతి - ఒక్కరోజులో శ్రీనివాసుడి దర్శనం! టికెట్​ ధర ఎంతంటే!

స్వామివారి విగ్రహ రహస్యం :తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేశుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారుతుందట. ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదట. అంతేకాదు.. గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందట. ఇది కూడా నేటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది.

విగ్రహ రాతి విశిష్టత :ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలి పోతుంది. కానీ, నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం రాస్తుంటారు పండితులు. అయినా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం.

గర్భగుడిలో దీపాల రహస్యం : తిరుమల దేవాలయం గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం.. గర్భగుడిలోని వేంకటేశ్వరుని విగ్రహం ముందుంచే మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియవు. నేటికీ శ్రీవారి ఎదుట ఆ దీపాలు వెలుగుతుంటాయని పండితులు చెబుతున్నారు.

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో!

ABOUT THE AUTHOR

...view details