Rahul Gandhi Stitched Slippers :రాహుల్ గాంధీ కుట్టిన స్లిప్పర్కు రూ.10 లక్షలు ఆఫర్ వచ్చినట్లు తెలిపాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చెప్పులు కుట్టే వ్యక్తి రామ్ చేత్. అయితే ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్లు చెప్పాడు. ఆయన కుట్టిన చెప్పులను ఓ గ్లాస్ ఫ్రేమ్‌లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని రామ్ చేత్ పేర్కొన్నాడు.
రాహుల్ గాంధీ కుట్టిన స్లిప్పర్ రేటు రూ.10 లక్షలు- 'ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చే ప్రసక్తే లేదు!' - Rahul Gandhi Stitched Slippers
Rahul Gandhi Stitched Slippers : రాహుల్ కుట్టిన చెప్పులు రూ. లక్షలు పలుకుతున్నాయి. ఎన్ని రూ.లక్షలు అయినా వెచ్చించి వాటిని కొనేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.
Published : Aug 1, 2024, 8:36 PM IST
'రాహుల్ గాంధీ నా పార్టనర్'
"రాహుల్ నా వద్దకు వచ్చిన తర్వాత, నన్ను అదృష్టం వరించింది. నా ప్రపంచం పూర్తిగా మారి పోయింది. ఇంతకుముందు నేనెవరికీ తెలియదు, కానీ ఇప్పుడు అందరూ నా షాప్‌నకు వచ్చిన నాతో సెల్ఫీలు దిగుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు నా షాప్ వద్దకు వచ్చిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు కొనాలనుకుంటున్నట్లు నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ఒకరు అత్యధికంగా రూ.10 లక్షలు ఇస్తామన్నారు. మంగళవారం ప్రతాప్‌గఢ్ నుంచి ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. నేను తిరస్కరించేసరికి, రూ.10 లక్షలకు పెంచారు. కానీ, ఆ చెప్పులు అమ్మబోనని, అవి నా అదృష్టం అని వారికి చెప్పాను. నా షాప్‌లో కూర్చిండి చెప్పులు కుట్టడం వల్ల, రాహుల్ గాంధీ నా పార్టనర్ అయ్యారు. ఆయన కుట్టిన చెప్పులను ఓ గ్లాస్ ఫ్రేమ్‌లో భద్రపరుస్తా" అని వివరించాడు రామ్ చేత్.
రిటర్న్ గిఫ్ట్
పరువు నష్టం కేసులో ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ వెళ్లారు. దారిలో రామ్ చేత్ షాపు వద్ద ఆగి అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఓ చెప్పుల జత కుట్టారు. ఓ షూని కూడా తయారు చేశారు. అనంతరం సహాయం చేస్తామని హామి ఇచ్చి వెళ్లిపోయారు. తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాయం చేశారు. ఆ వ్యక్తికి కుట్టు యంత్రాన్ని పంపించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.