SC On Father Custodial Rights On Kids: తన పిల్లల(మైనర్లు) బాధ్యతలను బంధువులకు అప్పగించినా సరే తండ్రి సహాజ సంరక్షకుడిగా ఉండే హక్కును కలిగి ఉంటాడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బంధువుల దగ్గర ఉన్న తన కుమార్తెను అప్పగించాలని కోరుతూ ఓ తండ్రి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. పిల్లలను సంరక్షకుడిగా ఉండే హక్కు తల్లికే కాకుండా తండ్రికి కూడా ఉంటుందని పేర్కొంది.
'కూతురిని చూసుకునే బాధ్యత తండ్రికి లేదు'
కరోనా సమయంలో గౌతమ్ కుమార్ దాస్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆడపిల్ల పుట్టిన 10 రోజులకే ఆ శిశువు తల్లి మరణించింది. దీంతో ఆ పిల్లలిద్దరినీ సంరక్షణను అతడి భార్య సోదరీమణులకు అప్పగించాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరినీ తనకు అప్పగించాలని కోరాడు. అయితే వాళ్లు కుమారుడు ఇచ్చి, కుమార్తెను వాళ్లే దగ్గరే ఉంచుకున్నారు. పాపను కూడా ఇవ్వాలని కోరగా దానికి బంధువులు నిరాకరించారు. తమ దగ్గరే ఉంటుందని అన్నారు. దీంతో ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ అమ్మాయిని చూసుకునే బాధ్యతను ఆ మహిళలకే అప్పగించి, గౌతమ్‌ను కేవలం అప్పుడుప్పుడు వెళ్లి చూసుకునే అవకాశం మాత్రం కల్పించింది. ఈ తీర్పును గౌతమ్ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటషన్ దాఖలు చేశాడు.