తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విపక్షాలపై రాజ్యసభ ఎన్నికల ఎఫెక్ట్!- హిమాచల్​, యూపీలో పరిస్థితులు మారేనా? - sp congress alliance in up

Rajya Sabha Election Impact On Lok Sabha Election : కొన్నాళ్ల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల ప్రభావం లోక్​సభ ఎలక్షన్లపై పడే అవకాశం కనిపిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్ల ఎస్​పీ, కాంగ్రెస్ చెరో రాజ్యసభ సీటును నష్టపోయాయి. మరి లోక్​సభ ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు ఆ రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తిని తగ్గిస్తాయా? బీజేపీని ఏ మేర కట్టడి చేస్తాయో? తెలుసుకుందాం.

Rajya Sabha Election Impact On Lok Sabha Election
Rajya Sabha Election Impact On Lok Sabha Election

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 9:59 AM IST

Rajya Sabha Election Impact On Lok Sabha Election : ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలను చూస్తే విపక్ష పార్టీలకు కొంత ఇబ్బందికర పరిస్థితులనే చెప్పాలి. ఎందుకంటే హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్​ ఓటింగ్​కు పాల్పడి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. అలాగే ఉత్తర్​ప్రదేశ్​లోనూ సమాజ్​వాదీ పార్టీ అరడజనుకుపైగా ఎమ్మెల్యేలు కమలం పార్టీకి జై కొట్టారు. దీంతో యూపీ, హిమాచల్​లో బీజేపీ అదనంగా చెరో సీటును గెలుచుకోగలిగింది. అయితే లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ హవా తట్టుకుని యూపీలో కాంగ్రెస్- ఎస్​పీ కూటమి, హిమాచల్​లో కాంగ్రెస్ ఏ మేర సీట్లు సాధిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ
హిమాచల్​ప్రదేశ్​లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హస్తం పార్టీ గెలవాల్సిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ ఎగరేసుకుపోయింది. ఇందులో హస్తం పార్టీ స్వయంకృతాపరాధం ఉన్నట్లు కనిపిస్తోంది. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై పార్టీ నాయకుల్లో అసమ్మతి ఉన్నా, అధిష్ఠానం చక్కదిద్దడంలో విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హిమాచల్​ప్రదేశ్​కు చెందిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజ్యసభ ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్​ను హెచ్చరించారు. బయటి వ్యక్తిని రాజ్యసభ ఎన్నికల బరిలో నిలపవద్దని కోరారు. అయినా అధిష్ఠానం పట్టించుకోకుండా అభిషేక్ మను సింఘ్విని బరిలో దించింది. క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల సింఘ్వి ఓటమిపాలై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే హిమాచల్​ప్రదేశ్​లో శాసనసభ ఎన్నికల్లో సీఎం పదవి ఎంపికలో HPCC చీఫ్ ప్రతిభా సింగ్, మంత్రి విక్రమాదిత్య సింగ్​ వాదనను పట్టించుకోకుండా సుఖును ప్రతిపాదించింది అధిష్ఠానం. ఈ విషయంపై అప్పటి నుంచి వారు గుర్రుగా ఉన్నారు.

క్రాస్ ఓటింగ్​కు కారణం!
2016-2022 వరకు హిమాచల్​ నుంచి రాజ్యసభకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ, మరో పర్యాయం పెద్దల సభకు వెళ్లాలని ఆశించారు. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం మరో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వివైపు మొగ్గు చూపించింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి చెందిన నేతను కాకుండా ఇతరులను రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డారు. అంతేకాకుండా సుఖుపై ఉన్న ఆగ్రహం కూడా వారు క్రాస్ ఓటింగ్​కు పాల్పడేటట్లు చేసిందని సమాచారం.

ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉన్న మాట వాస్తవం. పద్నాలుగు నెలల క్రితం పార్టీ హైకమాండ్ సుఖును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించినప్పటి నుంచి ఎమ్మెల్యేలలో ఒక వర్గం గుర్రుగా ఉంది. ఎందుకంటే వారు హిమాచల్​ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబట్టారు. అయినా అనుహ్యంగా అధిష్ఠానం సుఖుకు సీఎంగా అవకాశం కల్పించింది. ఇంతటి సంక్షోభంలో ఉన్న హస్తం పార్టీ త్వరలో జరగబోయే లోక్​సభ ఎన్నికల్లో ఏ మేర రాణిస్తుందో చూడాలి.

యూపీలో మారనున్న సమీకరణాలు
యూపీలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్ 17, ఎస్​పీ 63 స్థానాల్లో పోటీ చేయనుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఏడుగురు ఎస్​పీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి బీజేపీ అభ్యర్థికి ఓటేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి చెందిన వారు అమేఠి, రాయ్‌బరేలీలో పోటీచేసే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటేసిన ఎస్​పీ రెబల్ ఎమ్మెల్యేలు ఆ ప్రాంతానికి చెందినవారే. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ విషయంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యవహరించిన తీరుపై వారు అసహనానికి గురయ్యారు. దీంతో వారు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఎస్​పీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, యూపీలో ఇండియా కూటమికి అంత మంచిదికాదు. గాంధీ కుటుంబీకులు అమేఠి, రాయ్‌బరేలీలో పోటీ చేయాలని భావిస్తే ఎస్​పీ నేతల మద్దతు అవసరం.

'ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం కావాలి'- సుప్రీంను కోరిన ఎస్‌బీఐ

3రోజులుగా ఫ్రెండ్​ మృతదేహంతోనే- గదిలో సెంట్​ కొడుతూ గడిపిన కుటుంబం- భయంతోనేనట!

ABOUT THE AUTHOR

...view details