తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాన్స్​జెండర్స్​, విభిన్న ప్రతిభావంతులతో 'నుక్కడ్​ కేఫ్'- అన్నీ నడిపించేది వారే- ఎక్కడుందో తెలుసా? - DISABLED PERSONS NUKKAD CAFE

విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్​జెండర్స్ కోసం కేఫ్​ ఏర్పాటు- వారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రియాంక్ పటేల్

Disabled Persons Nukkad Cafe
Disabled Persons Nukkad Cafe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 12:24 PM IST

Disabled Persons Nukkad Cafe In Chhattisgarh :సమాజంలోని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్​జెండర్స్​కు జీవనోపాధి కల్పిస్తున్నారు ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ వ్యక్తి. వారి కోసం కేఫ్​లను ఏర్పాటు చేసి ఆర్థిక భరోసాను ఇస్తున్నారు. చెవిటి, మూగ, మరుగుజ్జులకు తన కేఫ్​లో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఆయనే నుక్కడ్ కేఫ్ నిర్వాహకుడు ప్రియాంక్ పటేల్.

ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేసి
ప్రియాంక్ పటేల్ నుక్కడ్ కేఫ్​ను తొలుత 2013లో రాయపుర్​లోని సమతా కాలనీలో ప్రారంభించారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయినప్పటికీ ఆయనకు ఆ ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఏదైనా కుటుంబంలో విభిన్న ప్రతిభావంతులు పుడితే వారు పడే కష్టాల గురించి ప్రియాంక్ ఆందోళన చెందారు. ఈ క్రమంలో విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్స్, మరుగుజ్జులు కోసం ఏదైనా చేయాలని తపించారు. ఇలాంటి వారికోసం ఒక వేదికను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకుని నుక్కడ్ కేఫ్​లను ఏర్పాటు చేశారు.

50శాతం మంది వాళ్లే
ఇప్పడు రాయ్​పుర్, దుర్గ్​లో కలిపి నాలుగు నుక్కడ్ కేఫ్ ఉన్నాయి. వీటిలో దాదాపు 70 మంది పనిచేస్తున్నారు. ఆ సిబ్బందిలో 50 శాతం మంది విభిన్న ప్రతిభావంతులే. చెవిటి, మూగ, ట్రాన్స్ జెండర్స్, మరుగుజ్జులు కూడా ఉన్నారు. కేఫ్​కి వచ్చే కస్టమర్లతో వీరు మాటామంతీ కలిపి కలిసిపోతారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన తినుబండారాలను సరదాగా అందిస్తుంటారు. దీంతో ఈ కేఫ్​ను కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

కస్టమర్స్​తో నుక్కడ్​ కేఫ్ ఉద్యోగి (ETV Bharat)

ట్రాన్స్ జెండర్సే అక్కడ ఉద్యోగులు
అలాగే దుర్గ్​లో ఉన్న నుక్కడ్ కేఫ్​ను ట్రాన్స్ జెండర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. వారు గౌరవంగా పనిచేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే కేఫ్ వచ్చిన కస్టమర్లతో గౌరవంగా వ్యవహరిస్తున్నారు.

కస్టమర్స్​ను​ స్వాగతిస్తున్న ట్రాన్స్​జెండర్ (ETV Bharat)

'విభిన్న ప్రతిభావంతులు పట్ల ప్రజల ఆలోచన మారింది'
"నేను కేవలం 4 అడుగుల ఎత్తే ఉంటాను. నన్ను చూసి ప్రజలు ఎగతాళి చేసేవారు. ఉపాధి కోసం కూడా చాలా చోట్ల తిరిగాను. తర్వాత రాయ్​పుర్​లోని నుక్కడ్ కేఫ్ లో ఉద్యోగం ఇచ్చింది. నేను ఈ కేఫ్​లో ఏడేనిమిదేళ్లుగా పనిచేస్తున్నాను. నాకు ఇక్కడ పనిచేయడం చాలా ఇష్టం. కేఫ్​లోని కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకోవడం నా బాధ్యత. నేను అన్ని పనులకు చేయగలను. ఈ కేఫ్ విభిన్న ప్రతిభావంతులు పట్ల ప్రజల ఆలోచనను మార్చింది." అని నుక్కడ్ కేఫ్​లో పనిచేస్తున్న మరుగుజ్జు మనీశ్ తెలిపాడు.

నుక్కడ్ కేఫ్​లో పని చేస్తున్న మరుగుజ్జు మనీశ్ (ETV Bharat)

మూగ, చెవిటి యువకుడు సైతం
తానే భవిష్యత్తులోనూ ఇదే ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు కేఫ్​లో పనిచేస్తున్న బధిర యువకుడు నీలేశ్ చెప్పాడు. కస్టమర్లు సంజ్ఞా భాషలో లేదా కాగితంపై రాయడం ద్వారా తనకు ఆర్డర్ ఇస్తారని తెలిపాడు. ఆ తర్వాత ఈ ఆర్డర్​ను కిచెన్​లో ఉన్న చెఫ్​లకు తెలియజేస్తానని పేర్కొన్నాడు. కేఫ్​కు వచ్చే కస్టమర్లు తమతో సంభాషిస్తారని వెల్లడించాడు.

నుక్కడ్​ కేఫ్ ఉద్యోగి (ETV Bharat)

సర్వీసుకు కస్టమర్లు సైతం ఫిదా
అలాగే కేఫ్​లో విభిన్న ప్రతిభావంతుల పనితీరుపై కస్టమర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను నుక్కడ్ కేఫ్​కు క్రమం తప్పకుండా వస్తుంటానని పాయల్ అనే ఓ కస్టమర్ చెప్పారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది సంజ్ఞల ద్వారా ఆర్డర్లు తీసుకుంటారని తెలిపారు. అలాగే నుక్కడ్ కేఫ్​లో విభిన్న ప్రతిభావంతులు పనిచేస్తున్నారని మరో కస్టమర్ పేర్కొన్నారు. వారికి ఈ కేఫ్ ద్వారా మంచి వేదిక లభించిందని అభిప్రాయపడ్డారు. విభిన్న ప్రతిభావంతులు వేరే చోట పనిచేసేటప్పుడు అసౌకర్యంగా భావిస్తారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details