తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ - తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా - RAHUL GANDHI GRANTED BAIL

'సావర్కర్​పై అనుచిత వ్యాఖ్యల' కేసులో రాహుల్ గాంధీకి బెయిల్​!

Rahul Gandhi
Rahul Gandhi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2025, 10:01 AM IST

Rahul Gandhi Granted Bail : సావర్కర్‌ పరువునష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి పుణెలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాహుల్‌గాంధీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతానికి బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2023లో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ - హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'స్నేహితులతో కలిసి ఓ ముస్లీం యువకుడిని చితకబాది ఆనందించానని స్వయంగా సావర్కర్‌ తన పుస్తకంలో రాసుకున్నారు' అని రాహుల్‌ ఆరోపించారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని, ఊహాజనిత ఆరోపణలు అని సావర్కర్‌ మనుమడు సాత్యకి సావర్కర్‌ రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా వేశారు. రాహుల్‌ ఉద్దేశపూర్వకంగా సావర్కర్‌ ప్రతిష్ఠను దిగజార్చేందుకు పదేపదే యత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details