Qatar India Navy Officers Realesed : గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికదళ అధికారులు విడుదలయ్యారు. సోమవారం ఉదయం దొహాలోని జైలు నుంచి విడుదలైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. "ఖతార్‌లో శిక్ష అనుభవిస్తున్న 8మంది నావికదళ అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇందులో ఏడుగురు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం" అని అధికారిక ప్రకటనలో వివరించింది.
ప్రధాని మోదీకి అధికారుల ధన్యావాదాలు
ఖతార్ జైలు నుంచి విడుదలైన అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ జోక్యం చేసుకోకపోతే తాము బయటకు వచ్చేవారము కాదని చెప్పారు. తమను విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నేవీ అధికారుల విడుదలపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. మరణ శిక్ష పడిన అధికారులు తిరిగి ఇంటికి రావడం సంతోషమని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
Indian Navy Officers Detained In Qatar : భారత్‌కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్‌లోని అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు (Qatar Indian Navy Issue). అయితే, వీరందరికి భారత అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది ఖతార్ ప్రభుత్వం. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు బాధితులతో పాటు ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. అనంతరం ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం, ఆ 8 మందికి మరణ శిక్ష విధిస్తూ (Qatar Indian Navy Officers Death Penalty) గతేడాది అక్టోబరులో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని వారికి ఇటీవలె మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది న్యాయస్థానం.
భారత నేవీ మాజీ అధికారులకు ఊరట- మరణశిక్ష రద్దు చేసిన ఖతార్ కోర్టు
ఖతార్‌లో నేవీ అధికారులకు మరణశిక్షపై అప్పీల్- వారిని కలిసేందుకు మరో ఛాన్స్