Prajwal Revanna Return To India :లౌంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్ణాటకలోని హాసన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు తిరిగి రానున్నట్లు తెలిపారు. మే 31న సిట్ ముందు హాజరు కానున్నట్లు వెల్లడించారు. విచారకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తాతకు (మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు), తల్లిదండ్రులకు, పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు.
"ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగినప్పుడు నాపై ఎలాంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు కాలేదు. నా విదేశీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమే. 2-3 రోజుల తర్వాత నేను నా పర్యటనలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా నాపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. సిట్ కూడా నాకు నోటీసు అందించింది. ఆ నోటీసుకు కూడా నేను స్పందించాను. నా అడ్వొకేట్ ద్వారా ఏడు రోజులు సమయం ఇవ్వాలని కోరాను. ఈ అంశాపై వివిధ సభల్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారు. ఇదంతూ చిసిన తర్వాత నేను డిప్రెషన్‌కు లోనయ్యాను. ఎవరితో టచ్‌లో ఉండలేదు. దానికి ప్రతిఒక్కరిని క్షమాపణ కోరుతున్నా." అని ప్రజ్వల్ రేవణ్ణ వివరించారు.
"నాపై రాజకీయ కుట్ర చేశారు"
హాసన్ నియోజకవర్గంలోని కొన్ని శక్తులన్నీ ఏకమై తనపై కుట్ర చేశాయని ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపించారు. "నన్ను రాజకీయంగా అంతం చేయడానికి అందరూ కలిసి పనిచేశారు. ఇదంతా చూసి షాక్ అయ్యి దూరంగా ఉండిపోయాను. దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదు. మే 31న మే 31న(శుక్రవారం) నేను స్వయంగా సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఈ తప్పుడు కేసు నుంచి బయటపడేందుకు న్యాయపరంగా పోరాడతాను. దేవుడు, ప్రజలు, నా కుటుంబ సభ్యుల ఆశీస్సులు నాపై ఉండాలి." అని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు.
ఇదీ కేసు
ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీఎస్ పార్టీకి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్‌గా మారాయి. మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణతో పాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ హోళెనరసిపుర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. యితే ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.