తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​లోని ప్రతి ప్రాంతానికీ సందేశ్​ఖాలీ తుపాను'- టీఎంసీపై మోదీ ఫైర్ - sandeshkhali incident in bengal

PM Modi On Sandeshkhali : బంగాల్​లోని అధికార టీఎంసీ సర్కార్​పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. సందేశ్​ఖాలీ తుపాను బంగాల్​లోని ప్రతి ప్రాంతానికీ చేరుకుంటుందని అన్నారు. టీఎంసీని నాశనం చేయడంలో మహిళా శక్తి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

PM Modi On Sandeshkhali
PM Modi On Sandeshkhali

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 1:50 PM IST

Updated : Mar 6, 2024, 2:28 PM IST

PM Modi On Sandeshkhali :సందేశ్‌ఖాలీ తుపాను బంగాల్‌లోని ప్రతి ప్రాంతానికీ చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార టీఎంసీని నాశనం చేయడంలో నారీశక్తి(మహిళా శక్తి) కీలక పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన దారుణాలు సిగ్గుచేటని విమర్శించారు. మహిళా సాధికారత, వారి భద్రతకు మోదీ హామీ అని తెలిపారు. బంగాల్​లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని బరాసత్​లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

కేంద్రంలో ఎన్​డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం వస్తుందని గ్రహించిన ఇండియా కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. తనకు ఏ సమస్య వచ్చినా, సోదరీమణులు, తల్లులు తన చుట్టూ రక్షణ కవచంలా నిలుస్తారని అన్నారు. ' నా కుటుంబం గురించి అడుగుతున్న ప్రతిపక్ష నేతలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఈ దేశ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే. చిన్నవయసులో ఇల్లు వదిలిపెట్టి వెళ్లి సన్యాసిలా తిరిగేవాడిని. నా దగ్గర డబ్బు లేదు. అయినా ఖాళీ కడుపుతో పడుకున్న రోజు లేదు. ఆ సమయంలో పేదలు నన్ను ఆదుకున్నారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడితో నాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి.' అని మోదీ వ్యాఖ్యానించారు.

టీఎంసీ సర్కార్​పై విమర్శలు
బంగాల్​లోని టీఎంసీ సర్కార్ మహిళలకు ఎప్పటికీ రక్షణ కల్పించదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సందేశ్​ఖాలీలో దారుణాలకు కారకుడైన వ్యక్తిని టీఎంసీ ప్రభుత్వం రక్షించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. 'నిరుపేద, దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన సోదరీమణులు, కూతుళ్లపై టీఎంసీ నేతలు పలు ప్రాంతాల్లో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బంగాల్​, దేశంలోని మహిళలు సందేశ్​ఖాలీ దారుణాలపై ఆగ్రహంతో ఉన్నారు. సందేశ్​ఖాలీ దారుణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. టీఎంసీ నేతలు రాష్ట్ర మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.' అని మోదీ తెలిపారు.

బాధితులను కలిసిన ప్రధాని మోదీ
సందేశ్​ఖాలీ నుంచి వచ్చిన బాధిత మహిళలను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. తమ కష్టాలను మహిళలు మోదీకి వివరించారు. ప్రధాని మోదీ సందేశ్​ఖాలీ భాదితుల కష్టాలు ఒక తండ్రిలా ఓపికగా విన్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తమ బాధను ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని బాధితులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని పేర్కొన్నాయి.

దేశంలోనే ఫస్ట్ అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ- విద్యార్థులతో కలిసి ప్రయాణం

కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టో రెడీ!- వారికే అత్యంత ప్రాధాన్యం

Last Updated : Mar 6, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details