MSP Hike On Kharif Crops :ఖరీఫ్‌లో 14 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరలు పెంచింది. వరికి 117 రూపాయలను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పెంపుతో క్వింటాల్ ధాన్యం ధర 2,300 రూపాయలకు చేరింది. వరితో పాటు పత్తి, రాగి, మొక్క జొన్న, జొన్నపంటలకు MSPని పెంచినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. పంట ఉత్పత్తి ధరకు పెంచిన ఎమ్మెస్పీ కనీసం 1.5శాతంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు గుజరాత్, తమిళనాడులో మొత్తం 7వేల 453 కోట్లతో ఒక గిగావాట్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వధావన్‌లో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్‌ను 76వేల కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
పంటల మద్దతు ధరలు ఇలా ఉన్నాయి :
- వరి (సాధారణ రకం)- రూ.2300
- వరి (గ్రేడ్-ఎ)- రూ.2320
- జొన్న (హైబ్రిడ్)- రూ.3371
- జొన్న (మాల్దండి)- 3421
- సజ్జలు- రూ.2625
- రాగులు- రూ.4290
- మొక్కజొన్న- రూ.2225
- వేరుశెనగ- రూ.6783
- పొద్దుతిరుగడు విత్తనాలు- రూ.7280
- నువ్వులు- రూ.9267
- సోయాబీన్ (పసుపు)- రూ. 4892
- పెసలు- రూ.8682
- పత్తి (మధ్యరకం)- రూ.7121
- పత్తి (లాంగ్ స్టెపెల్)- రూ.7521
- కందులు- రూ.7550
- మినుములు- రూ.7400