Modi On Oppostion Allaince :అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ, సనాతన వ్యతిరేకుల పక్షాన నిలుస్తున్న ఇండియా కూటమికి జూన్ 4న ఫలితాల్లో గట్టి దెబ్బ తగులుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని తూర్పు చంపారన్‌లోని మోతిహరిలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
పేద కుటుంబంలో పుట్టిన వారికే!
వెండి చెంచాలతో పుట్టిన వారికి కష్టం విలువ ఏంటో తెలియదని మోదీ దుయ్యబట్టారు. ఇండియా కూటమి పాపాలతో దేశం ముందుకు సాగదని చెప్పారు. అంబేడ్కర్ లేకపోయి ఉంటే మాజీ ప్రధాని నెహ్రూ SC, ST లకు రిజర్వేషన్లు కల్పించేవారు కాదని మోదీ ఆరోపించారు. బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు విమర్శించడంపై మోదీ ఘాటుగా బదులిచ్చారు. స్విస్ బ్యాంకుల్లో నోట్ల కట్టలున్న వారికి సామాన్య ప్రజల పరిస్థితి అర్థం కాదని, పేద కుటుంబంలో పుట్టిన తనకు తెలుసని వ్యాఖ్యానించారు.