Raj Kapoor Songs World Record :బాలీవుడ్ షోమ్యాన్ రాజ్‌కపూర్ శత జయంతిని పురస్కరించుకుని జయపురలో సంగీత కార్యక్రమంతో ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో నిర్విరామంగా 30 గంటలపాటు రాజ్‌కపూర్ సినిమాలోని పాటలు ఆలపించి జైపుర్ వాసులు, సంగీతకారులు 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకున్నారు.
'240 మందికిపైగా గాయకులు, 450పాటలు'
రాజ్‌కపూర్ 100వ జయంతి సందర్భంగా శనివారం జయపురలో 'ఆవారా హున్' పేరిట సంగీత కార్యక్రమం జరిగింది. ఈ మ్యూజిక్ మారథాన్‌లో 260మందికి పైగా గాయకులు 450 కంటే ఎక్కువ పాటలను 30 గంటలు ఆలపించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన మ్యూజిక్ మారథాన్, ఆదివారం రాత్రి 7వరకు కొనసాగింది. దీంతో ఈ సంగీత కార్యక్రమం గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
'రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడానికి నియమ, నిబంధనలు'
'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' అనేది యూఎస్ ఆధారిత సంస్థ. ఇది ప్రపంచంలోని విశిష్ఠమైన పనులను గుర్తిస్తుంది. జయపురలో రాజ్‌కపూర్‌ను స్మరించుకుంటూ 30 గంటల నిరంతర గాన మారథాన్ జరిగింది. ఇలా ఇంతసేపు పాటలు పాడడం ఇదే తొలిసారి. గతంలో కొందరు ప్రయత్నించినా ఇంతసేపు నిర్విరామంగా పాటలు పాడలేకపోయారు. ఈ రికార్డు సాధించడానికి అనేక నియమ, నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించకుంటే ప్రపంచ రికార్డు వచ్చేది కాదు. రోటరీ క్లబ్ ఉడాన్, రోటరీ క్లబ్ క్రౌన్ కలిసి ఈ ఈవెంట్‌ను బాగా నిర్వహించాయి" అని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా హెడ్ అలోక్ కుమార్ తెలిపారు.
పాట పాడిన ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య
ఈ కార్యక్రమంలో హవా మహల్ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య పాల్గొన్నారు. ఆయన రాజ్‌కపూర్ ఫేమస్ సాంగ్ 'జీనా యహాన్ మర్నా యహాన్' అనే పాటను పాడి శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈ పాట పదాలు శాశ్వతమైనవని కొనియాడారు. రాజ్‌కపూర్ జీవించి ఉన్నా, లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
రాజ్‌కపూర్ స్మారకార్థం జయపురలో 30 గంటల పాటు ఆయన పాటలతో సంగీత కార్యక్రమం నిర్వహించామని బల్ముకుంద్ ఆచార్య తెలిపారు. సంగీత ప్రియులు ఈ మ్యూజిక్ మారథాన్‌కు హాజరయ్యారని పేర్కొన్నారు. సంగీతం భగవంతుని స్వరమని, అది భగవంతుని కలవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని కొనియాడారు.