తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రష్యా ఆర్మీలో ఇండియన్స్​- బలవంతంగా ఉక్రెయిన్​తో యుద్ధం- రక్షించాలని తల్లిదండ్రుల రిక్వెస్ట్ - రష్యా సైన్యంలో భారతీయులు

Indians In Russian Army : రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని నలుగురు భారతీయులను ఓ ఏజెంట్ మోసం చేశారు. మాస్కో వెళ్లాక బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించారని, వారిని కాపాడి తిరిగి తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Indians In Russian Army
Indians In Russian Army

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 10:43 AM IST

Updated : Feb 23, 2024, 2:29 PM IST

Indians In Russian Army : విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నలుగురు భారతీయులను ఓ ఏజెంట్ రష్యా సైన్యంలో చేర్పించినట్లు తెలుస్తోంది. అందులో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తితో పాటు కర్ణాటకకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. రష్యా తరపున ఉక్రెయిన్​తో యుద్ధం చేసేందుకు బలవంతంగా పంపిస్తున్నారని తల్లిదండ్రులకు బాధితులు సమాచారం ఇచ్చారు. దీంతో తమ పిల్లలను కాపాడి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏజెంట్​కు రూ. 3.80 లక్షలు!
ఉత్తర్​ప్రదేశ్​లోని కాస్​గంజ్​కు చెందిన అర్బాబ్​ హుస్సేన్ గతేడాది నవంబర్ 11న ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా మాస్కోలో ఉద్యోగం చేసేందుకు వెళ్లారని ఆయన తండ్రి అష్రఫ్ హుస్సేన్​ తెలిపారు. 'అర్బాబ్ హుస్సేన్​ను​ రష్యాకు పంపించేందుకు బ్యాంకు నుంచి రూ. 3.80 లక్షలు రుణం తీసుకుని ఏజెన్సీకి ఇచ్చాను. మాస్కోకు వెళ్లాక పాస్​పోర్ట్​, వీసాకు తీసుకుని రష్యన్​ భాషలో సంతకం చేయమని అడిగారు. ఆ తర్వాత వారిని రష్యా తరపున ఉక్రెయిన్​తో యుద్ధం చేసేందుకు సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్లారని అర్బాబ్​ చెప్పాడు' అని అష్రఫ్ హుస్సేన్ తెలిపారు. తన కుమారుడిని తిరిగి ఇండియాకు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి అష్రఫ్ విజ్ఞప్తి చేశారు.

బలవంతగా సైన్యంలోకి
కర్ణాటక కలబురగికి జిల్లాకు చెందిన సయ్యద్ ఇలియాస్ హుస్సేన్, మహ్మద్ సమీర్ అహ్మద్, సోఫియా మహ్మద్ ముగ్గురు యువకులు సెక్యూరిటీ గార్డులుగా మాస్కోలో పని చేసేందుకు వెళ్లారు. ముంబయికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లానని, ఆ తర్వాత సైన్యంలోకి చేర్పించినట్లు ఓ యువకుడు తాను మాట్లాడుతున్న వీడియోను పంపాడు. హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న హుస్సేన్ తండ్రి నవాజ్ కాలగి కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేను కలిసి ఈ విషయం గురించి చెప్పారు. తమ పిల్లలను రక్షించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.

"నా కుమారుడితో పాటు ఇంకొంతమంది భారతీయులు ఉన్నారు. హుస్సేన్ ఇంతకుముందు దుబాయ్​లో పని చేసేవాడు. రెండేళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం యూట్యూబ్​ వీడియోలు చేసే ఏజెంట్​ను సంప్రదించాడు. అతడు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉందని చెప్పాడు. వీసాలు సిద్ధం చేసుకుని చెన్నై మీదుగా మాస్కోకు వెళ్లారు. ఐదు రోజుల తర్వాత అక్కడికి వెళ్లామని హుస్సేన్ ఫోన్ చేశాడు​. మళ్లీ 15 రోజులకు ఫోన్​ చేసి రష్యా సైన్యంలో చేర్పించారని, ఉక్రెయిన్ సరిహద్దులకు తీసుకెళ్తున్నారని మేం మోసపోయానని చెప్పాడు" అని నవాజ్ తెలిపారు.

విదేశాంగ శాఖ మంత్రికి లేఖ
'తెలంగాణ, కర్ణాటక, ఉత్తర భారతదేశంలోనూ ఇలా చాలా మందిని రష్యా సైన్యంలో చేర్చినట్లు సమాచారం తెలుస్తోంది. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని, వారని వెంటనే రక్షించాలి' అని విదేశాంగ శాఖ మంత్రికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.

అయితే ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. రష్యా ఆర్మీలోకి బలవంతంగా చేర్పించిన నలుగురు భారతీయులకు విముక్తి కల్పించేందుకు మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది. యుద్ధ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని సూచించింది. భారతీయులంతా జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

భారత్‌-రష్యా సీక్రెట్లు పాక్​కు! మాస్కోలోని ఎంబసీలో ISI ఏజెంట్!- మేరఠ్​లో​ అరెస్ట్​

సత్యపాల్‌ మాలిక్ ఇంట్లో సీబీఐ సోదాలు- ఆ కేసు విచారణలో భాగంగానే

Last Updated : Feb 23, 2024, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details