తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ పర్యటక రంగ వృద్ధిలో RFCది ముఖ్యస్థానం- గుజరాత్​లోనూ నిర్మిస్తే బాగుంటుంది!' - Ramoji Film City

గుజరాత్​లోనూ ఆర్ఎఫ్​సీ లాంటి ఓ ఫిల్మ్ సిటీని నిర్మించాలని రామోజీ గ్రూప్​ను కోరారు ఆ రాష్ట్ర పర్యటక మంత్రి మంత్రి ములుభాయ్ బేరా. గాంధీనగర్​లో జరిగిన ట్రావెల్​ అండ్ టూరిజం ఫెయిర్​లో ఆర్ఎఫ్​సీ స్టాల్​ను ఆయన సందర్శించారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ పర్యటక రంగ వృద్ధికి ఆర్ఎఫ్​సీ సాయపడుతుందని కొనియాడారు.

Ramoji Film City
Gujarat State Tourism Minister Mulubhai Bera (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 11:45 AM IST

Updated : Aug 9, 2024, 12:02 PM IST

గుజరాత్ రాజధాని గాంధీనగర్​లో జరిగిన ట్రావెల్​ అండ్ టూరిజం ఫెయిర్​లో హైదరాబాద్​లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​ సిటీ (ఆర్ఎఫ్​సీ) స్టాల్​ సందడి చేసింది. ఈ ఫెయిర్​లో గుజరాత్ పర్యాటక శాఖ మంత్రి ములుభాయ్ బేరా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్​సీపై ప్రశంసలు కురిపించారు. గుజరాత్​లో కూడా ఆర్ఎఫ్​సీ తరహాలో ఫిల్మ్ సిటీని నిర్మించాలని రామోజీ గ్రూప్​ను మంత్రి ములుభాయ్ బేరా కోరారు.

దేశ పర్యాటక రంగ వృద్ధికి ఊతం
ఆర్ఎఫ్​సీలో ఆధునిక చిత్ర నిర్మాణ పద్ధతులు, మాస్ కమ్యూనికేషన్ టెక్నిక్స్​ను ఉపయోగిస్తున్నారని మంత్రి బేరా వివరించారు. రామోజీ ఫిల్మ్ సిటీ భారతదేశ పర్యటక పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తుందని కొనియాడారు. హైదరాబాద్​లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని తాను చూశానని వెల్లడించారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​లో ఉన్న ఆర్ఎఫ్​సీ అధికారులతో ఆయన మాట్లాడారు. భారతదేశంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో రామోజీ గ్రూప్ అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. ఈ ఫెయిర్ దేశ పర్యాటక రంగ అభివృద్ధికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.

'మంచి స్పందన వస్తోంది'
ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్​కు మంచి స్పందన వస్తోందని ఆ సంస్థ వెస్ట్రన్ రీజియన్ చీఫ్ మేనేజర్ సందీప్ వాగ్మారే తెలిపారు. 'దేశంలో టూరిజం రంగానికి గుజరాత్ పెద్ద మార్కెట్. గుజరాత్ నుంచి చాలా మంది టూర్​లకు వెళ్తుంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎప్పుడూ గుజరాతీలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్​గా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో టూర్ ప్యాకేజీలు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్​తో సహా పర్యటకుల కోసం వివిధ రకాల సౌకర్యాలు ఉన్నాయి' అని అన్నారు.

మరోవైపు, సందర్శకులు సైతం ఆర్ఎఫ్​సీపై ప్రశంసలు కురిపించారు. తాము క్రమం తప్పకుండా ఫిల్మ్ సిటీకి వెళ్తుంటామని ఆకాశ్ పటేల్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో అహ్మదాబాద్ నుంచి 18 మంది పర్యటకుల బృందం హైదరాబాద్​లోని ఆర్ఎఫ్​సీని సందర్శిస్తుందని పేర్కొన్నారు. రెండు రోజులు అక్కడే ఉంటారని ట్రావెల్ బిజినెస్ చేస్తున్న ఆకాశ్ పటేల్ వెల్లడించారు.

గాంధీనగర్​లోని మహాత్మా మందిర్​లో జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్​లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన స్టాల్స్​ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్​లో ఆ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి టూరిస్ట్​లకు అధికారులు వివరిస్తారు. ఈ ఫెయిర్​లో వ్యాపారానికి సంబంధించిన సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల వల్ల ప్రయాణికులు తక్కువ ధరకే మంచి పర్యటక ప్యాకేజీలను పొందుతారు.

‘కడుపు నిండింది, మనసూ నిండింది'- వయనాడ్‌కు సాయంగా 'మోయి విరుంధు'! - Wayanad Landslides

'ఇప్పటికీ హసీనానే బంగ్లాదేశ్​ ప్రధాని!- అవామీ లీగ్​ కథ ఇంకా ముగిసిపోలేదు' - Sheikh Hasina resignation analysis

Last Updated : Aug 9, 2024, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details