తెలంగాణ

telangana

సూపర్ టిప్స్ : ఎండాకాలం తర్వాత కూలర్​ ఇలా భద్రపరచండి - కొన్ని ఏళ్లపాటు చక్కగా పనిచేస్తుంది! - After Summer Air Cooler Clean tips

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 5:19 PM IST

Air Cooler Cleaning Tips : సమ్మర్​లో​ కూలర్​ లేనిదే నిమిషం ఉండలేం. కానీ.. ఎండాకాలం ముగిసిన తర్వాత దాన్ని ఏదో ఒక మూలకు నెట్టేస్తాం. మళ్లీ ఏడాది తిరిగితేగానీ దాని బూజ దలపం! అప్పటికీ కూలర్​ పార్టులన్నీ తుప్పుపట్టి పోతాయి. కొన్ని కూలర్లు పాత సామాను బండిలో కూడా పడిపోతాయి. ఇలా జరగొద్దంటే.. కొన్ని టిప్స్ పాటించండి. ఏళ్ల తరబడి చక్కగా పనిచేస్తుంది!

Air Cooler Cleaning Tips
Air Cooler Cleaning Tips (ETV Bharat)

How to Clean Air Cooler After Use in Summer: మాగ్జిమమ్ ఇప్పుడు కూలర్ ఎవరూ వాడకపోవచ్చు. ఎండాకాలం పూర్తయి.. వర్షాలు మొదలయ్యాయి. ఇప్పుడు మీ కూలర్ ఏ పరిస్థితిలో ఉందో ఓసారి వెళ్లి చూడండి! అలాగే ఉంచితే కొన్ని రోజుల్లోనే తుప్పు పట్టడం మొదలవుతుంది. మళ్లీ సమ్మర్​ వచ్చేనాటికి పార్టులన్నీ పూర్తిగా పాడై, కొత్తవి కొనాల్సి పరిస్థితి వస్తుంది. అందుకే.. ఇప్పుడే జాగ్రత్తపడండి. మీ కూలర్​ను భద్రంగా ఉంచడానికి ఈ టిప్స్​ పాటించండి. ఇవి పాటిస్తే.. తప్పకుండా మరో 5 సంవత్సరాల పాటు కూలర్​ చక్కగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. ఆ టిప్స్​ ఏంటో చూద్దాం..

  • కూలర్​ను జాగ్రత్తగా భద్రపరచే ముందు.. మొదట స్విచ్​ బోర్డుకు ఉన్న ప్లగ్స్​ తీయాలి.
  • ఆ తర్వాత కూలర్​లో ఏమైనా నీళ్లు మిగిలి ఉంటే వాటిని బయట పారబోయండి.
  • కూలర్​ లోపల నీళ్లన్నీ తొలగించినా.. నాలుగు మూలల్లో నీళ్లు మిగిలి ఉంటాయి. అవి కూడా తీసేసి తడి లేకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు కూలింగ్​ ప్యాడ్​లను కూలర్​ నుంచి వేరు చేసి వాటిని సపరేట్​గా క్లీన్​ చేయాలి. వాటిని క్లీన్​ చేయడానికి చిన్న బ్రష్​లు ఉపయోగించడం మంచిది.
  • బ్రష్​ వల్ల చిన్న చిన్న మూలాల్లో ఉన్న దుమ్ము కూడా క్లీన్​ అవుతుంది. కూలింగ్​ ప్యాడ్​లకు ఉన్న గడ్డి తాజాగా ఉంటే దాన్ని సపరేట్​గా స్టోర్​ చేయండి.
  • దెబ్బతింటే పడేయండి. మళ్లీ కొత్తగా తీసుకోవచ్చు. పెద్దగా ఖర్చు కాదు. కొత్త గడ్డితోనే కూలింగ్ ఎక్కువగా వస్తుంది.

ఐరన్​ దోశ పెనం నల్లగా మారిందా? - ఇలా చేసి అద్భుతాన్ని చూడండి! - Iron Dosa Tawa Cleaning Tips

  • ఇప్పుడు కూలర్​ లోపల భాగాలను క్లీన్​ చేసుకోవాలి. తర్వాత ఫ్యాన్​ బ్లేడ్లు, మోటారుకు ఉన్న దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకోవాలి.
  • ఇందుకోసం అవసరాన్ని బట్టి.. క్లాత్​, బ్రష్​ ఉపయోగించవచ్చు.
  • ఆ తర్వాత గాలి పంకను మోటారు నుంచి వేరు చేయండి. పెద్ద స్క్రూ డ్రైవర్​తో మీరే విప్పుకోవచ్చు.
  • తర్వాత మోటారు వైర్ కనెక్షన్​ తొలగించి.. ఇనుప కడ్డీలకు బిగించిన బోల్టులు విప్పేసి.. మోటారును బయటకు తీయండి. ఒకవేళ మీకు మోటారు తీయడం రాకపోతే ఎలక్ట్రిషీయన్​ సాయం తీసుకోవచ్చు.
  • పొడి క్లాత్​తో శుభ్రంగా క్లీన్​ చేసిన తర్వాత.. తుప్పు పట్టకుండా ఉండటానికి ఆయిల్​ అప్లై చేయాలి. ఈ ఆయిల్స్​ మార్కెట్లో లభిస్తాయి.
  • ఆ తర్వాత మోటారు కొనుగోలు చేసినప్పుడు వచ్చిన బాక్స్​లో స్టోర్​ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మరేదైనా బాక్సులో పెట్టి తడి తగలని చోట ఇంట్లో దాచండి.
  • అలాగే వాటర్​ మోటార్​ను కూడా రిమూవ్​ చేసి శుభ్రం చేసుకుని స్టోర్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు.. మిగిలిన కూలర్​ భాగాల్లో ఏమైనా దుమ్ము, చెత్త ఉంటే మరొక్కసారి శుభ్రం చేసుకుని దానిపై క్లాత్​ లేదా కవర్​ కప్పి ఇంట్లో ఓ సైడ్​కు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కూలర్ ఎప్పుడూ నిటారుగానే నిలబెట్టాలి. పడుకోబెట్టకూడదు.
  • కూలర్ వినియోగం పూర్తయిన తర్వాత ఈ టిప్స్​ పాటించి భద్రపరిస్తే.. మళ్లీ వచ్చే సమ్మర్​ లో నేరుగా బిగించుకొని వాడుకోవచ్చు. కొత్త కూలర్​ కొనాల్సిన అవసరమే ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details