Healthy Foods to Feed Dog : పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ డాగ్స్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. వాటిని తమ సొంత పిల్లల్లాగా సాకుతుంటారు. అయితే ఇంట్లో డాగ్స్(Dogs) పెంచుకునే వారు ముఖ్యంగా వాటికి పెట్టే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తాము తినే వాటినే కుక్కలకు ఆహారంగా పెడుతుంటారు. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఫుడ్స్ వాటికి హాని కలిగించొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఇంట్లో కుక్కను పెంచుకునే వారు వాటికి ఏ ఆహారం మంచిది? ఏది చెడ్డది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కుక్కలకు పెట్టాల్సిన బెస్డ్ ఫుడ్స్ :
యాపిల్స్ :ఇది మీ కుక్కల ఆరోగ్యానికి మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అవి అందులోని విత్తనాలు తప్ప మిగతావన్నీ తినగలవు. కాబట్టి మీరు వాటికి యాపిల్స్ అందించే ముందు ముక్కలను కట్ చేసి విత్తనాలు తీసి అందించండి.
చికెన్ : మీ డాగ్ డైట్లో తగినన్ని ఎమైనో యాసిడ్స్, ప్రొటీన్స్ ఉండేలా చూసుకోండి. అందుకోసం మీరు మసాలా లేకుండా బోన్ లెస్ చికెన్ ఉడికించి వాటికి అందించండి. ఫలితంగా అవి ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంటాయి.
సాల్మన్ చేప: మీరు మీ కుక్కకు అందించాల్సిన మరో బెస్ట్ ఫుడ్ ఐటమ్ సాల్మన్ చేప. ఇందులో ఉండే ఒమేగా -3 కొవ్వులు డాగ్ ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇది మీ కుక్క స్కిన్, కోట్ని హెల్దీగా ఉంచుతుంది కూడా. కాబట్టి మీ డాగ్ డైట్లో ఒమేగా-3 ఉండేలా చూసుకోండి.
ఓట్ మీల్ : ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ డాగ్ డైట్లో చేర్చడం ద్వారా దాని జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే దీనిని కుక్కకు అందించే ముందు చల్లార్చి ఇవ్వండి.
పెరుగు :కుక్కలకు తగినంత కాల్షియం లభించాలంటే వాటి డైట్లో పెరుగు ఉండేలా చూసుకోవాలి. అయితే అన్ని కుక్కలు పెరుగు తినడానికి ఇష్టపడవు. దానిని గమనించాలి.
గుడ్లు : కుక్కలకు పెట్టాల్సిన మరో హెల్దీ ఫుడ్.. ఉడికించిన గుడ్లు. వీటిని అందించడం ద్వారా వాటికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అందులో ఉండే కాల్షియం, అమైనో ఆమ్లాలు మీ డాగ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.