తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IPL స్టార్​గా మార్చేసిన సైకిల్- దిల్లీ టీమ్​లోకి మన్వంత్​- డ్రైవర్ కొడుకు సక్సెస్ స్టోరీ! - MYSORE BOY SOLD IN IPL AUCTION 2025

ఐపీఎల్​ వేలంలో సెలెక్ట్ అయిన తొలి మైసూరు కుర్రాడు - రోజూ దాదాపు 15 కిలోమీటర్లు సైక్లింగ్- యువకుడి జర్నీలో కీలక పాత్ర పోషించిన సైకిల్ కథ ఇదే?

Mysore Boy sold in IPL Auction 2025
Mysore Boy sold in IPL Auction 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 2:40 PM IST

Delhi Capitals buys Mysore Boy In IPL Auction 2025 :సాధారణ మధ్య తరగతి కుర్రాడు సాధించాడు. మిడిల్​క్లాస్​ కష్టాలన్నీ దాటి మెగా క్రికెట్ టోర్నమెంట్​ ఇండియన్ ప్రీమియర్​ లీగ్​- ఐపీఎల్​లో అడుగుపెట్టాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్​ రూ.30 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. అయితే అతడు ఈ స్థాయికి రావడంలో సైకిల్​ కీలక పాత్ర పోషించింది. అయితే ఆ కుర్రాడు ఎవరు, అతడికి సైకిల్ ఎలా సాయం చేసిందంటే?

అంతా ఆ సైకిల్ చలవే!
కర్ణాటకలోని మైసూరుకు చెందిన మన్వంత్ కుమార్​ ఐపీఎల్​లో అరంగేట్రం చేయనున్నాడు. మన్వంత్​​ ఐపీఎల్​కు సెలెక్ట్​ కావడంలో అతడి తల్లిదండ్రులు, సోదరుడితో పాటు ఓ సైకిల్​ కూడా తన వంతు సహాయం చేసింది. మన్వంత్ కుమార్​ పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాడు. ఆతడి సోదరుడు హేమంత్​ కుమర్ కూడా క్రికెటరే. ఇతడిని చూసే మన్వంత్​ క్రికెట్​పై మక్కువ పెంచుకున్నాడు. క్రికెట్ పాక్టీస్ చేయాలంటే ఇంటి నుంచి దాదాపు 15 కిలోమీటర్లు వెళ్లాలి. హేమంత్​ వద్ద మాత్రమే సైకిల్​ ఉంది.

దీనిపై ఇద్దరు తమ క్రికెట్ కిట్లను పట్టుకుని వెళ్లాలంటే చాలా కష్టం. అయితే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్​పోర్ట్ కార్పొరేషన్​- బీఎమ్​టీసీలో డ్రైవర్​గా పనిచేసే మన్వంత్​ తండ్రి లక్ష్మి కుమార్​కు మరో సైకిల్​ కొనేంత స్తోమత లేదు. ప్రాక్టీస్​ లేకుంటే ఆట మీద ప్రభావం పడుతుంది. తన కుమారులు ఎట్టి పరిస్థితిల్లోనూ వెనకడుగు వేయకూడదని, ఎలాగోలా డబ్బులు అడ్జస్ట్​ చేసి మరో సైకిల్​ కొనుగోలు చేశాడు లక్ష్మి కుమార్. అలా ఇద్దరి ప్రాక్టీస్​ ఆటంకం లేకుండా సాగింది. అలా మన్వంత్ ఐపీఎల్​లోకి సెలెక్ట్​ కావడానికి ఆ సైకిల్​ ద్వారా గ్రౌండ్​ సిద్ధం అయింది.

మన్వంత్ వాడిన సైకిల్ (ETV Bharat)

"నా కుమారుడు ఐపీఎల్​ వంటి పెద్ద టోర్నీకి ఎంపికయ్యాడు. భవిష్యత్తులో మన్వంత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి. గతేడాది ఐపీఎల్ వేలంలో 26మందిలో ఆరుగురికి ఛాన్స్​ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన మెగా వేలంలో- మొదటిసారి మైసూరు నుంచి ఐపీఎల్​కు ఎంపికైన ప్లేయర్​గా మన్వంత్ నిలిచాడు."
--లక్ష్మి కుమార్, మన్వంత్ కుమార్ తండ్రి

పట్టు వదల్లేదు!
మన్వంత్​ జర్నీలో సోదరుడి సాయం మరువలేది. అన్ని విధాలా తమ్ముడికి హేమంత్ అండగా నిలిచాడు. దీనికి మన్వంత్​ క్రమశిక్షణ జతచేశాడు. రోజూ ఉదయం 5 గంటలకు లేచి వ్యాయామం చేసేవాడు. అనంతరం 9 గంటలకు బాలచంద్ర క్రికెట్ క్లబ్​లో ప్రాక్టీస్​కు వెళ్లేవాడు. అక్కడ కోచ్​ బాలచంద్ర- మన్వంత్​కు క్రికెట్​లో మెలకువలు నేర్పాడు. అలా గతేడాది జరిగిన వేలంలో మన్వంత్​ పాల్గొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏ జట్టు అతడిని కొనుగోలు చేసుకోలేదు. అన్​సోల్డ్​గా మిగిలిపోయినా మన్వంత్​ నిరాశ పడలేదు. అదే క్రమశిక్షణతో ప్రయత్నించాడు. ఈసారి దిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది. అయితే కనీసం ఓ బ్యాగు, షూ కొనలేని స్థితి నుంచి ఐపీఎల్​లో ఆడే స్థాయికి ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడు ఎదగడం అంటే అంత తేలికైన విషయం కాదు.

కుటుంబ సభ్యులతో మన్వంత్ కుమార్ (ETV Bharat)

"మన్వంత్ ఐపీఎల్​కు సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తండ్రి రాత్రి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత- ఆయనతో కలిసి మన్వంత్ క్రికెట్ ఆడేవాడు. నా పెద్ద కుమారుడికి క్రికెట్​పై ఆసక్తి ఉండేది. అనంతరం మన్వంత్​ కూడా క్రికెట్​పై మక్కువ పెంచుకున్నాడు. మా చుట్టుపక్కల వాళ్లు కూడా తగినంత సాహాయం చేశారు. మన్వంత్ ఎన్నడూ ప్రాక్టీస్ ఆపలేదు. భవిష్యత్తులో ఇంకా బాగా ఆడతాడు."
--శ్రీదేవీ కుమార్, మన్వంత్ కుమార్ తల్లి

'మా తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు'
మన్వంత్ లైఫ్​​లో ఇది ఫస్ట్​ స్టేజ్​ మాత్రమే అని, ఇంకా మున్ముందు చూడాల్సింది చాలా ఉందని హేమంత్ కుమార్ అన్నాడు. ప్రస్తుతం అతడి ముందు ఉన్న అవకాశాన్ని మన్వంత్​ సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు. "నేను కూడా ఒక క్రికెటర్​నే. అండర్​ 16, 19, 23 లీగ్​ల్లో ఆడాను. ఇప్పుడు మన్వంత్​కు మంచి అవకాశం వచ్చింది. మన్వంత్​ అండర్ 14, మైసూరు జోన్​ నుంచి అండర్ 16కి ఎంపికయ్యాడు. అండర్ 19లో కూడా మంచి ప్రతిభ కనబర్చాడు. ఇప్పుడు ఇందౌర్​లో సయ్యద్​ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. మన్వంత్ చాలా కష్టపడుతున్నాడు. అతడు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది" అని హేమంత్​ అన్నాడు.

మన్వంత్ కుమార్ (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details