Eyebrows Threading at home : మహిళల అందంలో ముఖంలోని ప్రతీ భాగమూ ముఖ్యమైనదే. ఇందులో కనుబొమ్మల పాత్ర మరింత కీలకం. పర్ఫెక్ట్ షేప్లో ఉన్న ఐబ్రోస్తో లుక్ అద్దిరిపోద్దంటే నమ్మాల్సిందే. అందుకే.. ఎక్స్ట్రా ఉన్న వెంట్రుకలను తొలగించుకునేందుకు తరచూ పార్లర్‌కు వెళ్తుంటారు. చక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు.. వారిని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.
అయితే.. ఈ ఉరుకుల పరుగుల షెడ్యూల్లో బ్యూటీ పార్లర్‌కు గంటలకొద్దీ సమయం కేటాయించడం చాలా మందికి కుదరదు. అంతేకాకుండా.. అన్ని బ్యూటీ సెలూన్లూ బడ్జెట్ అనుకూలమైనవి కావు. అందుకే.. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే.. ఇంట్లోనే మీరే స్వయంగా ఐబ్రోస్ థ్రెడింగ్ చేసుకోండి. అది ఎలాగో మేం నేర్పిస్తాం. ఇందుకోసం సింపుల్ చిట్కాలు ఇస్తున్నాం.
అప్పర్ లిప్పై ప్రాక్టీస్ చేయండి..
మాగ్జిమమ్ జనాలు బ్యూటీ పార్లర్కే వెళ్తారు కాబట్టి.. వారికి స్వయంగా థ్రెడింగ్ చేసుకోవడం రాదు. అది కొంచెం కష్టమైన పని కూడా. అయితే.. మీరు ఇంట్లో చేసుకోవాలని అనుకుంటే.. నేరుగా కనుబొమ్మలపైనే ప్రయోగం చేయకూడదు. షేప్ దెబ్బతింటే ఫీలవ్వాల్సి వస్తుంది. మళ్లీ వెంట్రుకలు పెరిగే వరకు ఆగాలి. కాబట్టి.. మీ పై పెదవి మీద ప్రాక్టీస్ చేయండి. థ్రెడింగ్ ద్వారా హెయిర్ ఎలా రిమూవ్ చేస్తారో.. ఆ విధంగా మీరు అప్పర్ లిప్ మీద ప్రాక్టీస్ చేయండి. తద్వారా.. మీకు ప్రాక్టీస్ అవుతుంది.
థ్రెడ్ పర్ఫెక్ట్గా ఉండాలి..
పని ఏదైనా సక్సెస్ కావాలంటే.. ముందుగా పనిముట్టు పక్కాగా ఉండాలి. ఇది ఐబ్రోస్కు సైతం వర్తిస్తుంది. మీరు థ్రెడింగ్ చేసుకోవడానికి చక్కటి థ్రెడ్ కావాలి. చాలా మందికి ఎలాంటి థ్రెడ్ అవసరమో తెలియదు. మార్కెట్లో అందుబాటులో ఉండే పలు రకాల థ్రెడ్‌ల మధ్య మంచిది ఏదో గుర్తించలేరు. ఏదో ఒకటి పట్టుకొస్తారు. కానీ.. మందపాటి థ్రెడ్ తీసుకోకూడదు. ఇది థ్రెడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి కూడా కలుగుతుంది. అందువల్ల.. ఎల్లప్పుడూ సన్నటి దారాన్ని మాత్రమే కొనాలని గుర్తుంచుకోండి.