Maharashtra Chief Minister :మహారాష్ర్టలో అధికార పంపిణీపై దిల్లీలో కసరత్తు మెుదలైంది. గురువారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై దాదాపు గంట సేపు అమిత్ షాతో చర్చించారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన ఫోటోలను బీజేపీ నేత ఫడణవీస్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అంతకుముందు శివసేన నేత ఏక్‌నాథ్ శిందేతో అమిత్ షా ఏకాంతంగా సమావేశమయ్యరు.
మహారాష్ట్ర సీఎం ఎంపికపై కసరత్తు షురూ- తెరపైకి ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లు! ఫడణవీస్ ఫ్యూచరేంటి? - MAHARASHTRA CHIEF MINISTER
మహారాష్ట్ర సీఎంపై దిల్లీలో కసరత్తు ప్రారంభం - దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్న బీజేపీ అధిష్ఠానం
Published : Nov 29, 2024, 7:15 AM IST
బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం చాలా బాగా, పాజిటివ్‌గా జరిగిందనని ఏక్‌నాథ్ శిందే తెలిపారు. ఇది మొదటి సమావేశం అని, మరో మీటింగ్ ఉంటుందని చెప్పారు. ముంబయిలో జరిగే ఆ సమావేశంలో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ర్టలోని సామాజిక సమీకరణళలను బీజేపీ అధిష్ఠానం బేరీజు వేస్తున్నట్లు సమాచారం. OBC, మరాఠా వర్గాలకు చెందిన నేతల పేర్లనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడణవీస్ సీఎం రేస్‌లో ముందున్నా- బీజేపీ అధిష్ఠానం మరో ఆలోచనపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ శిందే తిరస్కరించినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 2న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూటమి నేతలు చెబుతున్నారు.