CBI Arrests EX RG Kar Hospital principal :ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటుగా మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఘోష్‌ను సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి తరలించింది. వైద్యకళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్‌పై ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వ రోజు విచారించిన సీబీఐ అరెస్టు ఆయన్ను చేసింది. ఘోష్‌ను అరెస్టు చేసిన ఒక గంటలోపే, సీబీఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డుతో పాటు ఆస్పత్రికి సామాగ్రి సరఫరా చేసే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు.
సందీప్ ఘోష్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబరు వరకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అయితే, 2023లో బదిలీ అయినా, నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి వచ్చారు. వైద్య విద్యార్థి హత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్‌గా ఉన్నారు. వైద్యురాలి హత్యాచారంలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సుపరింటెండెంట్ అక్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో బంగాల్ ప్రభుత్వం ఆగస్టు 23న సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.