తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీనియర్లకు పాత శాఖలే కేటాయింపు- రామ్మోహన్‌, పెమ్మసానికి ఏం ఇచ్చారంటే? - cabinet ministers of india 2024 - CABINET MINISTERS OF INDIA 2024

Cabinet Ministers Of India 2024 : కేంద్రంలో వరుసగా మూడో విడత మోదీ సర్కార్‌ కొలువుదీరిన వేళ మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. సీనియర్లకు పాత శాఖలనే కేటాయించారు ప్రధాని మోదీ.

central government cabinet allocation
central government cabinet allocation (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 7:49 PM IST

Updated : Jun 10, 2024, 8:52 PM IST

Cabinet Ministers Of India 2024 :కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. ముందుగా అనుకున్నట్లే కీలక శాఖలను బీజేపీ నేతలకే కట్టబెట్టారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీకి పాత శాఖల్నే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయాన శాఖ, కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖల బాధ్యతలు అప్పగించారు. మంత్రులకు కేటాయించని శాఖలను ప్రధాని మోదీ వద్దే అట్టిపెట్టుకున్నారు.

ప్రధాని మోదీ వద్దనున్న శాఖలు :సిబ్బంది వ్యవహారాలు, పించన్లు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతోపాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు.

మంత్రులకే కేటాయించిన శాఖలు ఇవే

1. రాజ్‌నాథ్‌ సింగ్‌ (బీజేపీ)- రక్షణ శాఖ

2. అమిత్ షా (బీజేపీ)- హోం మంత్రిత్వ, సహకార శాఖ

3. నితిన్ గడ్కరీ (బీజేపీ)- రోడ్లు, జాతీయ రహదారులు

4. జగత్ ప్రకాశ్ నడ్డా (బీజేపీ)- ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు

5. శివరాజ్ సింగ్ చౌహాన్ (కొత్త) (బీజేపీ)- వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి

6. నిర్మలా సీతారామన్ (బీజేపీ)- ఆర్థికం; కార్పొరేట్‌ వ్యవహారాలు

7. సుబ్రహ్మణ్యం జైశంకర్ (బీజేపీ)- విదేశీ వ్యవహారాలు

8. మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (బీజేపీ)- గృహనిర్మాణ, పట్టణభివృద్ధి; విద్యుత్తు

9. హెచ్.డి. కుమారస్వామి (కొత్త) (జేడీఎస్)- భారీ పరిశ్రమలు, ఉక్కు

10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (బీజేపీ)- వాణిజ్య, పరిశ్రమలు

II. ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ) - విద్య

12. జీతన్ రామ్ మాంఝి (కొత్త) (హెచ్ఎఎం) - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

13. రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (కొత్త) (జేడీయూ) - పంచాయతీరాజ్‌; మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ

14. సర్బానంద్ సోనోవాల్ (బీజేపీ)- షిప్పింగ్‌, పోర్టులు, వాటర్‌ వేస్‌

15. వీరేంద్ర కుమార్ (బీజేపీ)- సామాజిక న్యాయం, సాధికారత

16.కింజరాపు రామ్మోహన్ నాయుడు (కొత్త) (తెదేపా) - పౌర విమానయానం

17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి (బీజేపీ) - వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ; నూతన, పునరుత్పాదక ఇంధనం

18. జుయెల్ ఓరం (కొత్త) (బీజేపీ) - గిరిజన వ్యవహారాలు

19. గిరిరాజ్ సింగ్ (బీజేపీ) - జౌళి పరిశ్రమ

20. అశ్వినీ వైష్ణవ్ (బీజేపీ) - రైల్వే, సమాచార - ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌

21. జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ) - కమ్యూనికేషన్స్‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

22. భూపేంద్ర యాదవ్ (బీజేపీ) - పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు

23. గజేంద్రసింగ్ షెకావత్ (బీజేపీ)- పర్యటక, సాంస్కృతికం

24. అన్నపూర్ణాదేవి (కొత్త) (బీజేపీ) - మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి

25. కిరణ్ రిజిజు (బీజేపీ) - పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు

26. హర్దీప్ సింగ్ పూరి (బీజేపీ) - పెట్రోలియం, సహజవాయువులు

27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ (బీజేపీ) - కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు - యువజన వ్యవహారాలు

28. గంగాపురం కిషన్ రెడ్డి (బీజేపీ) - బొగ్గు, గనులు

29. చిరాగ్ పాసవాన్‌ (కొత్త) (ఎలేపీ- పాసవాన్) - ఆహార శుద్ధి పరిశ్రమలు

30. సి.ఆర్.పాటిల్ (కొత్త) (బీజేపీ)- జల్‌ శక్తి

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

31. రావ్ ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ) - గణాంకాలు, కార్యక్రమాల అమలు, సాంస్కృతిక

32. జితేంద్రసింగ్ (బీజేపీ)- శాస్త్ర సాంకేతిక,, భౌగోళిక శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యహారాలు, పించన్లు, అణు ఇంధనం, అంతరిక్షం

33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ (బీజేపీ)- న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు

34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్‌ జాదవ్‌ (కొత్త) (శివసేన)- ఆయుష్‌, ఆరోగ్య - కుటుంబ సంక్షేమం

35. జయంత్ చౌధరి (కొత్త) (ఆర్ఎల్డీ)- నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్‌, విద్య

సహాయ మంత్రులు

36. జితిన్ ప్రసాద (కొత్త) (బీజేపీ) - వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్

37. శ్రీపాద్‌ యశో నాయక్ (బీజేపీ) - విద్యుత్తు, కొత్త పునరుత్పాక ఇంధనం

38. పంకజ్ చౌధరి (బీజేపీ) - ఆర్థికం

39. క్రిషన్ పాల్ (బీజేపీ) - సహకారం

40. రామ్ దాస్ అఠావలె (ఆర్ పీఐ)- సామాజిక న్యాయం, సాధికారత

41. రామ్ నాథ్ ఠాకూర్ (కొత్త) (జేడీయూ) - వ్యవసాయ, రైతు సంక్షేమం

42. నిత్యానందరాయ్ (బీజేపీ)- హోం

43. అనుప్రియ పటేల్ (అప్నాదళ్)- ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు - రసాయనాలు

44. వి.సోమన్న (కొత్త) (బీజేపీ)- జల్‌ శక్తి, రైల్వే

45. పెమ్మసాని చంద్రశేఖర్ (కొత్త) (తెదేపా)- గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌

46. ఎస్.పి.సింగ్ బఘేల్ (బీజేపీ)- మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్‌

47. శోభా కరంద్లాజే (బీజేపీ)- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి

48. కీర్తివర్ధన్‌ సింగ్‌ (కొత్త) (బీజేపీ)- పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ

49. బీఎల్ వర్మ (బీజేపీ) - వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం - సాధికారత

50. శాంతనూ ఠాకూర్ (బీజేపీ) - పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌

51. సురేష్ గోపి (కొత్త) (బీజేపీ) - పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం

52. ఎల్.మురుగన్ (బీజేపీ) - సమాచార - ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు

53. అజయ్ టమ్టా (బీజేపీ) - రోడ్డు రవాణా, హైవేలు

54. బండి సంజయ్‌ కుమార్‌ (కొత్త) (బీజేపీ) - హోం

55. కమలేష్ పాశ్వాన్ (కొత్త) (బీజేపీ) - గ్రామీణాభివృద్ధి

56. భగీరథ్ చౌదరి (కొత్త) (బీజేపీ) - వ్యవసాయ, రైతు సంక్షేమం

57. సతీశ్ చంద్రదూబే (కొత్త) (బీజేపీ) - బొగ్గు, గనులు

58. సంజయ్ సేఠ్ (కొత్త) (బీజేపీ)- రక్షణ

59. రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ (కొత్త) (బీజేపీ) - ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు

60. దుర్గాదాస్ ఉయికె (కొత్త) (బీజేపీ)- గిరిజన వ్యవహారాలు

61. రక్షా నిఖిల్ ఖడ్సే (కొత్త) (బీజేపీ)- యువజన వ్యవహారాలు - క్రీడలు

62. సుఖాంత మజుందార్ (కొత్త) (బీజేపీ) - విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

63. సావిత్రి ఠాకుర్ (కొత్త) (బీజేపీ)- మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి

64. టోకన్ సాహు (కొత్త) (బీజేపీ) - గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు

65. రాజ్‌ భూషణ్ చౌదరి (కొత్త) (బీజేపీ)- జల్‌ శక్తి

66. భూపతిరాజు శ్రీనివాస వర్మ (కొత్త) (బీజేపీ) - భారీ పరిశ్రమలు, ఉక్కు

67. హర్ష్ మల్హోత్రా (కొత్త) (బీజేపీ) - కార్పొరేట్‌ వ్యవహారాలు, రోడ్డు రవాణా - హైవేలు

68. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా (కొత్త) (బీజేపీ)- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార - ప్రజా పంపిణీ

69. మురళీధర్ మొహోల్ (కొత్త) (బీజేపీ) - సహకార, పౌర విమానయానం

70. జార్జ్ కురియన్ (కొత్త) (బీజేపీ) - మైనారిటీ వ్యవహారాలు, మత్స్య - పశుసంవర్ధక - డెయిరీ

71. పబిత్ర మార్గరీటా (కొత్త) (బీజేపీ) - విదేశీ వ్యవహారాలు, టెక్సటైల్స్‌

Last Updated : Jun 10, 2024, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details