తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికలపై స్కూల్ అటెండర్ లైంగిక వేధింపులు- హింసాత్మకంగా మారిన నిరసనలు - రైల్వేస్టేషన్​పై రాళ్ల దాడి - Badlapur Girls Sexually Assault

Badlapur Girls Sexually Assault : మహారాష్ట్రలోని ఠాణేలో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులను నిరసిస్తూ మంగళవారం చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆగ్రహించిన ఆందోళనకారులు పాఠశాలలను ధ్వంసం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్​పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. మరోవైపు నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు.

Maharashtra protests
Maharashtra protests (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 3:05 PM IST

Updated : Aug 20, 2024, 4:02 PM IST

Badlapur Girls Sexually Assault Protests : మహారాష్ట్ర ఠాణేలోని బద్లాపుర్‌లో ఇద్దరు విద్యార్థినులపై పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ మంగళవారం చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పాఠశాల గేటు, గోడలు, బెంచీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం రైల్​ రోకో నిరసన నిర్వహించారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు లోకల్‌ రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. స్టేషన్​పై రాళ్ల దాడులకు పాల్పడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సిబ్బందిని తొలగించింది. నిందితులపై అత్యాచారం యత్నం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ శిందే తెలిపారు.

ఇదీ జరిగింది
బద్లాపుర్​లోని ఓ పాఠశాల్లో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది. నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు విద్యార్థులు టాయిలెట్​కు వేళ్లారు. అదే సమయంలో దానిని శుభ్రం చేసే వంకతో అటెండర్, బాలికల వద్దకు వెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. వారిలో ఓ బాలిక ప్రైవేటు భాగాల్లో నొప్పిగా ఉందని తల్లిదండ్రలకు చెప్పవడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది. ఈ విషయంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ విషయంలో జాప్యం చేసినందుకు ఓ పోలీసు అధికారిని బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

రైల్వే సేవలు నిలిపివేత
ఈ ఘటనపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైల్‌ రోకో నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే ఈ నిరసనలను చేపట్టారు. ఈ క్రమంలో చాలా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం రంగంలోకి దిగిన అధికారులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించివేశారు. బద్లాపుర్​ నుంచి కర్జాత్​ మధ్య రైల్వే సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 10 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కర్జాత్-పన్​వేల్​-ఠాణే స్టేషన్ మీదుగా మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రిన్సిపల్​తో సహా ఇద్దరు సిబ్బంది సస్పెండ్
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం బాధిత కుటుంబాలకు క్షమాపణలను తెలియజేసింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా ప్రిన్సిపల్‌ను, ఆ పిల్లల క్లాస్‌ టీచర్‌, వారి బాధ్యతలు చూస్తున్న సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. అటెండర్​ను పంపించిన కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల ఆవరణంలో నిఘాను పెంచునున్నట్లు అధికాలు తెలిపారు.

న్యాయం చేస్తామని సీఎం హామీ
మరోవైపు ఈ ఘటనలో నిందితుడిపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు సీఎం ఏక్​నాథ్ శిందే తెలిపారు. అలాగే పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ను నియమించి, న్యాయం చేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్ చేశారు. ఒకవైపు మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, మరోవైపు ఆడపిల్లలకు భద్రత లేదని వాపోయారు.

Last Updated : Aug 20, 2024, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details