తెలంగాణ

telangana

'పాన్​, టపాసులపై దేవుళ్ల ఫొటోలా?'- రూల్స్ పాటించాలంటూ లక్ష కి.మీ బైక్ రైడ్- 14మంది CMలకు బాబా రిక్వెస్ట్ - Baba Bawandar Bike Tour

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 9:47 PM IST

Baba Bawandar Bike Tour : పొగాకు, బాణసంచా, అగరుబత్తీల ఉత్పత్తులపై దేవుళ్ల చిత్రాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ బాబా బావందర్ దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీ చేపట్టారు. 25 రాష్ట్రాల్లో లక్షా 11వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Baba Bawandar Bike Tour
Baba Bawandar Bike Tour (ETV Bharat)

Baba Bawandar Bike Tour : పొగాకు, బాణసంచా, అగరుబత్తీల ఉత్పత్తులపై దేవుళ్ల చిత్రాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ బాబా బావందర్ దేశవ్యాప్తంగా బైక్ రైడ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని నైనీతాల్ జిల్లాలోని నైనా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని భక్తులకు దేవుళ్ల చిత్రాలు ఉన్న వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించారు.

బైక్​పై దేశంలో పర్యటిస్తున్న బాబా (ETV Bharat)

హిందూ సమాజానికి చెందిన వారే హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని బావందర్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల చిత్రాల దుర్వినియోగంపై అవగాహన కల్పించటానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ మతానికి చెందిన దేవుళ్లు, దేవతల చిత్రాలను అవమానించరాదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28, 29 చెబుతుందని బాబా వెల్లడించారు. ఆర్టికల్ 295 సైతం మతవిశ్వాసాలను అవమానించరాదని తెలియజేస్తుందన్నారు. అయితే, ఆయా వ్యాపార సంస్థలు మాత్రం దేవతల చిత్రాలను తమ వ్యాపార ప్రకటనల కోసం వాడుకొని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల చిత్రాలను వాడటం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.

పొగాకు ఉత్పత్తులపై దేవుళ్ల బొమ్మల వినియోగంపై అవగాహన కల్పిస్తున్న బాబా (ETV Bharat)

''దేశవ్యాప్తంగా పొగాకు, బాణసంచా, అగరుబత్తీలతో పాటు వివిధ వస్తువులపై దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తున్నారు. అయితే, ప్రజలు దేవతల చిత్రాలతో ఉన్న ఆ వస్తువులను ఉపయోగించిన అనంతరం చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. అంటే మనమే మన దేవతలను అవమానిస్తున్నాం. ఇలాంటి వాటిపై అవగాహణ కల్పించేందుకు ఇప్పటివరకు, దేశంలోని 25 రాష్ట్రాల్లో బైక్​పై పర్యటించాను. సుమారు లక్షా 11 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశాను. ఇప్పటికైనా పొగాకు, క్రాకర్లు, అగరుబత్తీలతో పాటుగా ఇతర వస్తువుల ప్యాకింగ్​లపై దేవతల చిత్రాలను తొలగించాలి'' అని డిమాండ్ చేశారు.

బాబా బావందర్ బైక్ యాత్రలో ఇప్పటివరకు 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసినట్లు తెలిపారు. దేవుళ్ల చిత్రాలను వాడే సంస్థలు, వ్యక్తులకు ట్రేడ్ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని సీఎంలకు మెమోరాండం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశంపై ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులతో పాటు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని హెచ్చరించారు.

ఊరి కోసం మూడేళ్లుగా 'ఒంటి కాలి' దీక్ష! వినూత్న రీతిలో బచ్చా బాబా నిరసన - SAINT HATHA YOGA

'మీరేం అమాయకులు కాదు'- పతంజలి కేసులో రాందేవ్​ బాబాపై సుప్రీం ఆగ్రహం - Patanjali Misleading Ads Case

ABOUT THE AUTHOR

...view details