Aadhaar free Update :ఆధార్ ఎంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. విద్యాసంస్థల నుంచి బ్యాంకుల వరకూ.. ప్రభుత్వ పథకాల అర్హత నుంచి ప్రైవేటు సేవల వరకూ అన్ని విభాగాల్లోనూ ఆధార్ కీలకంగా మారింది. ఆయితే.. ఈ ఆధార్ వివరాలను పదేళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలో ప్రకటించింది. అప్పట్నుంచి పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ వరకు..
ఆధార్ ఉచిత అప్డేట్ గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచుతూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇప్పటి వరకూ అప్డేట్ చేసులేకపోయిన వారంతా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఆధార్ కార్డులో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన వారు కూడా చేసుకోవచ్చు. అయితే.. ఏ మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారో.. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉచిత సేవలు "మై ఆధార్" పోర్టల్ ద్వారా మాత్రమే లభిస్తాయి. కార్డుదారు పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి అంశాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకవేళ ఉచిత గడువులోపు అప్డేట్ చేసుకోలేకపోతే.. ఆధార్ కేంద్రాల్లో 50 రూపాయలు చెల్లించి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా అప్డేట్..
- ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారు.. చాలా ఈజీగా పని పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం.. మొదట UIDAI వెబ్‌సైట్‌లోకి మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ కావాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత.. మీ ఆధార్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- అవన్నీ జాగ్రత్త చదివి చూసుకోండి. ఇప్పుడు అందులో ఏ సమాచారం మార్చాలో చూసుకోండి. వాటిని సవరించుకోండి. ఒకవేళ సవరణ ఏమీ లేకపోతే NEXT బటన్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ సాయంతో.. డాక్యుమెంట్లను సెలక్ట్ చేసుకోండి.
- మీరు ఏ సమాచారం అప్డేట్ చేశారో.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి.. ఆ కాపీలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత మీకు 14 అంకెల "అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్" అందుతుంది. ఇదే మీ రెఫరెన్స్ నంబర్. దీని ద్వారా ..మీ అప్‌డేట్ స్టేటస్ పూర్తయిందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవటం ఎలా?- ఈజీ ప్రాసెస్ ఇదే!
మీ ఇంట్లో అద్దెకుండేవారి ఆధార్ అడిగారా? ఒరిజినలో కాదో ఎలా చెక్ చేయాలో తెలుసా?