Survey On Five Govt Guarantee Schemes In Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఐదు గ్యారెంటీలు అమలు విజయవంతంగా జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏడాదిగా ప్రభుత్వం వీటిని అమలు చేస్తోంది. అయితే గృహ జ్యోతి, శక్తి యోజన, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి వంటి పథకాల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి? ఆ పథకాలను ఎంత శాతం మంది వినియోగించుకుంటున్నారు? మొదలైనవాటిపై కర్ణాటక సర్కార్ సర్వే చేయించింది. అందులో పథకాల లబ్దిదారులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటంటే?
గృహ జ్యోతి : కర్ణాటకలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకం గృహ జ్యోతి. ఈ పథకం ఏడాదిగా రాష్ట్రంలో అమలవుతోంది. ఈ పథకంపై 45శాతం లబ్ధిదారులపై సర్వే పూర్తయ్యింది. మరో 55శాతం మందిపై సర్వే చేయాల్సి ఉంది. అయితే సర్వేలో పాల్గొన్న 45శాతం మంది లబ్దిదారుల్లో 98శాతం మంది గృహ జ్యోతి స్కీమ్ తమ జీవితాలను మెరుగుపరిచిందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం వల్ల తమ డబ్బు ఆదా అవుతోందని 33శాతం మంది చెప్పారు. చదువుకోవడానికి గృహ జ్యోతి పథకం ఉపయోగపడుతుందని 29శాతం మంది చెప్పుకొచ్చారు.
గృహ లక్ష్మి :గృహ లక్ష్మి పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 అందిస్తారు. ఈ పథకం కింద 63శాతం మందికి సర్వే పూర్తైంది. మరో 37 శాతం మందిని చేయాల్సి ఉంది. తమకు వచ్చిన రూ. 2,000లో 43శాతం డబ్బును పండ్లు, కూరగాయలను కొనడానికి మహిళలు ఉపయోగిస్తున్నారు. 13శాతం పిల్లల పాఠశాల విద్యకు వినియోగిస్తున్నారు. కాగా, 23శాతం మంది గృహ లక్ష్మి స్కీమ్ కింద వచ్చిన డబ్బును ఇంటి ఖర్చులకు వాడుతున్నారు. 15 శాతం మంది వైద్యం కోసం ఉపయోగిస్తున్నారు.
శక్తి : కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అందించే స్కీమ్ శక్తి. ఈ పథకాన్ని 98 శాతం మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. 94శాతం మంది ఈ పథకం బాగుందని ప్రశంసించారు.
అన్న భాగ్య :అన్న భాగ్య స్కీమ్ కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రతి నెల 10 కిలోల బియ్యం ఇస్తారు. ఈ పథకం లబ్దిదారుల్లో 73శాతం మందిని సర్వే చేశారు. మరో 27శాతం మందిని సర్వే చేయాల్సి ఉంది. బియ్యంతో పాటు పప్పులు, నూనె తదితర ఆహార పదార్థాలను ప్రభుత్వం అందజేస్తే బాగుంటుందని సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది లబ్దిదారులు ప్రభుత్వానికి సూచించారు.