ప్రతిధ్వని: పెట్రో మంటలు చల్లారేది ఎలా?
🎬 Watch Now: Feature Video
దేశంలో చమురు ధరలు పరుగులు పెడుతున్నాయి. పెట్రో మంటలు జనాన్ని కాల్చేస్తున్నాయి. ఎగబాకుతున్న ధరలు ద్రవ్యోల్బణానికీ ఆజ్యం పోస్తున్నాయి. కరోనా పంజా, లాక్‌డౌన్ చట్రాల్లో విలవిల్లాడుతున్న సామాన్యుల్ని మరింత కుంగదీస్తున్నాయి ఈ వాతలు. ఉద్యోగాల్లేవ్, జీతాల్లేవ్, చేతిలో డబ్బుల్లేవ్ అయినా.. ఏలిన వారికి బడుగులపై దయకలగడం లేదు. చమురు సంస్థల వరస వడ్డనలు ఆగడం లేదు. ఏడాది పైగా ఇదే తీరు. మధ్యలో చిన్న విరామాలు ఇచ్చినా.. మొత్తానికి మాత్రం సెంచరీ కొట్టేశాయి చమురు ధరలు. కొవిడ్ వేళ ఏంటీ పెట్రో పీడన అని.. ఎంతమంది ఎన్ని విధాల మొత్తుకుంటున్నా కనికరం అన్న మాటే వినిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరు దిక్కు? ఈ మంటలు చల్లారేది ఎలా? ఎప్పటికి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.